అల్లు అర్జున్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. లీకు నుండే భారీ హైప్ అందుకున్న ఈ సినిమా నుండి ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో.. AA23 ఇక రానట్లేనా? అనే ప్రశ్న లాంటి సమాచారం వైరల్ అయింది. ఈ క్రమంలో సినిమా టీమ్ మరో ఫొటో రిలీజ్ చేసి.. ‘ఇంకా ఉంది’ అని చెప్పారు. ఆ తర్వాత చిన్నా, చితకా లీక్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి సినిమా టైటిల్ లీక్ వచ్చింది.
ఈ లెక్కన చిత్రబృందం సినిమా పనులు ఫుల్ స్పీడ్‌లో ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని సులభంగానే అర్థమవుతోంది. ఆ విషయం పక్కన పెడితే.. లీక్ అని చెబుతున్న టైటిల్ గ్యాంగ్‌స్టర్. అవును ‘గ్యాంగ్‌స్టర్’ అనే పేరును సినిమాకు పెడుతున్నారు అని చెబుతున్నారు. ఆ లెక్కన సినిమా నేపథ్యంలో అండర్ వరల్డ్, గ్యాంగ్‌స్టార్ అని చెప్పేయొచ్చు. నిజానికి ఈ జోనర్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కి ఇదేం కొత్త కాదు. ఆయన తీసిన సినిమాలన్నీ ఇలాంటివే మరి.
ఇక AA23 విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు లోకేష్ కనగరాజ్ అండ్ టీమ్. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాకు అధికారికంగా కొబ్బరికాయ కొట్టి.. ఆ తర్వాత కొన్ని రోజులకు చిత్రీకరణను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట. ఇదంతా జరగాలి అంటే ‘రాకా’ సినిమా సంగతి తేలాల్సిందే.
అంతా క్లోజ్డ్ సెట్స్‌లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇప్పటివరకు తెలియడం లేదు. అయితే, వచ్చే ఏడాది ఆ సినిమా రావడం పక్కా అని చెబుతున్నారు. ఆ సినిమా వచ్చాక కానీ.. లోకేశ్ సినిమా సంగతి తేలేలా లేదు. ఎందుకంటే ‘రాకా’ కోసం బన్నీ.. ‘పుష్ప’ సినిమా కోసం పడ్డ కష్టానికి మించి పడుతున్నాడు మరి.