వరుస పరాజయాలు వచ్చాయనో లేక కొత్త కథ మీద నమ్మకమో తెలియదు కానీ.. రామ్ పోతినేని తన తర్వాతి సినిమా కోసం తానే మెగాఫోన్ పట్టుకున్నాడు. RAPO 23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఈ సినిమా టైటిల్. కొన్ని రోజుల క్రితం డెమో షూట్‌తో మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే వేరే సినిమా కారణంగా ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్ ఆగింది అని చెబుతున్నారు. ఆ వేరే సినిమా ఏంటో ఆఖరున చూద్దాం.
కొన్ని ముఖ్యమైన సన్నివేశాను షూట్ చేసి చూసుకొని ఓకే అనుకుంటే అప్పుడు అసలు సినిమా షూటింగ్ ప్రారంభించడమే డెమో షూట్. ఇక ఆ విషయం వదిలేస్తే.. ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రెండు, మూడు పేర్లు చర్చలోకి వచ్చింది. సినిమాకు ‘ఏక’ అనే టైటిల్ ఓకే చేసి, దానికి ‘ది లోన్ ఉల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. లేదంటే ‘ది లోన్ ఉల్ఫ్’ అనే టైటిల్ కూడా చర్చలో ఉందట. త్వరలో గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి టైటిల్ అనౌన్స్ చేస్తారని టాక్.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా చెప్పలేదు. సంయుక్త, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌లో ఒకరిని హీరోయిన్ ఎంపిక చేసుకుంటారు అని సమాచారం. ఇక పైన చెప్పిన ఆ ఇంకో సినిమానే రజనీకాంత్ ‘ధర్మన్’. ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయడానికి రామ్ ఓకే చెప్పాడట. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అందులో రామ్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఇందులో రజనీకాంత్‌కి అల్లుడిగా రామ్ కనిపిస్తాడని టాక్. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురిగా రాశీ ఖన్నా నటిస్తోంది. ఆమె లవర్ పాత్రలోనే రామ్ కనిపిస్తాడు. ఈ ఇద్దరూ గతంలో ‘శివమ్’, ‘హైపర్’ సినిమాల్లో కలసి నటించారు. ఇప్పుడు ఈ హ్యాట్రిక్ అవుతుంది.