ఈ రోజు వైల్డ్ కార్డ్ పక్కా…!

  • September 16, 2020 / 01:49 PM IST

బిగ్‌బాస్‌లో మజాను రెట్టింపు చేసేది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ. షో నడుస్తున్న సమయంలో వైల్డ్‌ కార్డ్‌ అంటూ కొత్తవారిని తీసుకొస్తుంటాడు పెద్దాయన. అలా ఈసారి కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎంతమంది వస్తారు, ఎప్పుడు వస్తారు అనేదే ప్రశ్న. గత మూడు సీజన్లలో వైల్డ్‌ కార్డు రూపంలో వచ్చినవారు అయితే గొడవలు పెంచారు, లేదంటే వినోదం పెంచారు. అయితే మొదటి వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే… ఔను ఈ రోజు అదే జరగబోతోందట. వైల్డ్‌ కార్డు ఎంట్రీ గురించి మాట్లాడితే ముఖ్యంగా నాలుగు పేర్లు వినినిపిస్తున్నాయి. అయితే అందులో ముగ్గురు మాత్రమే ఇంట్లోకి వస్తారని తెలుస్తోంది. ఇంకొరు ఇంట్లో ఉన్నవాళ్లే అని అనుకుంటున్నారు. అంటే… ఇంట్లో ఉన్నవారిని బయటకు పంపించేసి, మళ్లీ సీక్రెట్‌ ఓటింగ్‌ పేరుతో మళ్లీ తీసుకొస్తుంటారు కదా.. అలాగా. గత సీజన్‌ అలీ రెజా అలానే వచ్చాడు. ఈ సారి కూడా ఇలా ఎవరో ఒకరు వస్తారు.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లిస్ట్ లో ముందుగా వినిపిస్తున్న పేరు ముక్కు అవినాష్‌. ఇతను డైరెక్ట్‌ ఎంట్రీ ఇవ్వాల్సినవాడే. అయితే షో స్టార్ట్‌ దగ్గరపడుతుందనగా అవినాష్‌కు కరోనా సోకిందని సమాచారం. దీంతో క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాక లోపలకు పంపిస్తారని తెల్సింది. ఈ లెక్కన ఈ రోజు వచ్చేది అవినాష్ అనే అంటున్నారు. ఇక రెండో వాడు సాయికుమార్‌ పంపన. ఇలా తెలియకపోవచ్చు కానీ ఈరోజుల్లో సాయి అంటే తెలుస్తుంది. సినిమాల్లో నత్తి క్యారెక్టర్‌తో బాగా పాపులర్‌ అయ్యి… ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వైల్డ్‌ కార్డులో బిగ్‌బాస్‌ ఇంట్లో కనిపిస్తాడని అంటున్నారు. ఒకవేళ అవినాష్ కి ఇంకా రెస్ట్ అవసరం అనిపిస్తే … సాయిని ముందు పంపిస్తారు. అంటే ఈ రోజే.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటే అమ్మాయి లేకుండా కుదరదు కదా. గత సీజన్లలోనూ అదే జరిగింది. అందులో హాట్‌ హాట్‌ భామనే దింపుతారు. ఈ సారి ఆ హాట్‌.. తెలుగు అమ్మాయి స్వాతి దీక్షిత్‌ అంటున్నారు. ఎలిమినేషన్‌లో వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్‌ అయిపోతే… ఇబ్బంది లేకుండా స్వాతి దీక్షిత్‌ను లైన్‌లో పెట్టారట. కాబట్టి ఈ రోజు వైల్డ్ కార్డ్ అబ్బాయినే. అది అవినాష్ నా లేక సాయి నా అనేది రాత్రికి తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus