Mahesh Babu: మహేష్ చేతిలో ఉన్న ఈ క్యూట్ బేబీ ఎవరంటే?

  • August 9, 2022 / 06:33 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో జోరుమీదున్నారు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ప్రస్తుతం నటిస్తుండగా మహేష్ తర్వాత సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి దర్శకులుగా ఫిక్స్ అయ్యారు. మహేష్ గత మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించగా భవిష్యత్తు మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని చాలామంది భావిస్తున్నారు. అయితే మహేష్ చిన్నారిని ఎత్తుకుని దిగిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్ బాబు, సిమ్రాన్, సాక్షి శివానంద్ కాంబినేషన్ లో యువరాజు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ బాబు ఒక చిన్నారిని ఎత్తుకోగా ఈ క్యూట్ బేబీ హీరోయిన్ శ్రీదివ్య కావడం గమనార్హం. తెలుగులో బస్ స్టాప్, కేరింత సినిమాలలో నటించి శ్రీదివ్య పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమా ఆఫర్లతో శ్రీదివ్య బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి.

శ్రీదివ్య గుర్తు పట్టలేని విధంగా మారిపోయినా మహేష్ బాబు మాత్రం ఏం మారలేదని ఇప్పటికీ మహేష్ యంగ్ గానే కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలు, హీరోయిన్లుగా మారిపోతుండటం గమనార్హం. మరోవైపు సర్కారు వారి పాట వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమాకు పోటీగా భీమ్లా నాయక్, రాధేశ్యామ్ రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus