Comedian: టాలీవుడ్ లో మరో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కమెడియన్!

  • April 18, 2023 / 12:48 PM IST

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. తెలుగులో చాలాఏళ్ల నుంచి పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అల్లు రమేష్ తుదిశ్వాస విడిచారు. వైజాగ్ కి చెందిన ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ ఆనంద్ రవి తన ఫేస్ బుక్ పేజీలో మొదటి రోజు నుంచి మీరు నాకు అతిపెద్ద మద్దతుగా ఉన్నారు.. ఇప్పటీకి నా మైండ్ లో నీ మాటలు వినిపిస్తున్నాయి.

రమేష్ గారు మీ మరణాన్ని జీర్ణంచుకోలేకపోతున్నా.. మీరు నాలాంటి చాలా మంది హృదయాలను హత్తుకున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను. ఓం శాంతి అంటూ రాసుకొచ్చాడు. ఇటీవల విడుదలైన నెపోలియన్ సినిమాలో కూడా అల్లు రమేష్ నటించారు. వైజాగ్ లో ఉంటున్న ఆయన.. తాజాగా గుండెపోటుతో మరణించారు. ఈ విషయం కాస్త ఇప్పుడు ఆయన కుటుంబంలో విషాదం నింపింది. దీంతో ఆయన స్నేహితులు, సహా నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్ కు చెందిన (Comedian) అల్లు రమేష్ తొలుత నాటకాల్లో నటించారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే చెప్పుకోదగ్గ పాత్రలు లేకపోయినప్పటికీ.. తనదైన కోస్తా యాసతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రసారమవుతున్న ‘మా విడాకులు’ వెబ్ సిరీస్ లో మామగా నటిస్తున్నారు. షార్ట్స్, రీల్స్ చూసేవారికి.. ఈ సిరీస్ గురించి, అందులో కామెడీతో నవ్విస్తున్న రమేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

అలాంటి ఆయన ఇప్పుడు సడన్ గా చనిపోవడంతో అందరూ బాధపడుతున్నారు. మీ తరఫున సంతాపాన్ని వీలైతే కింద కామెంట్ పెట్టి తెలియజేయండి. 2020 నుంచి ఇప్పటికే చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది సినిమా రంగాన్నికి సంబంధించి మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus