Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

  • March 27, 2026 / 09:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

టాలీవుడ్లో(Tollywood) నవరసాలు పండించిన హీరోలు చాలా మంది ఉండొచ్చు. కానీ ‘శ్రీరాముడు’ అనగానే మనకు కొంతమంది నటులు మాత్రమే గుర్తుకొస్తారు.ఆ నీలమేఘ శ్యాముడి రూపంలో మెప్పించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

Tollywood

వింటిని ఎక్కుపెట్టిన కోదండ రాముడిలా సౌమ్యంగా అదే క్రమంలో గంభీరంగా కనిపించి ఎంప్పించడం అందరి వల్ల కాదు కదా.టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఆ పాత్రకు అందరినీ సెట్ చేయడం కష్టం.అందుకే వెండితెరపై శ్రీరామునిలా మెప్పించిన నటులు కూడా చాలా తక్కువ.

మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా.. వెండితెర పై శ్రీరాముని అవతారమెత్తి మెప్పించిన టాలీవుడ్ హీరోలు/నటులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) హరనాధ్ : విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు రావణుడిగా నటించి దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో అప్పటి తరం కథానాయకుడు హరినాథ్ శ్రీరాముడిగా నటించి మెప్పించారు. ఇందులో ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూత్తాము రారండి’ అనే పాట ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి.సుశీల గారు పాడిన ఆ పాటకి తర్వాత చాలా వెర్షన్లు వచ్చాయి కానీ.. ఏదీ కూడా ఒరిజినల్ ని మరిపించలేకపోయింది.

2) నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) : హరనాథ్ ని కూడా మరిపించి శ్రీరాముడు అంటే తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నందమూరి తారక రామారావు. 1960 – 70..ల టైంలో ఎన్టీఆర్ రాముడిగా నటించిన సినిమాకి సంబంధించిన పోస్టర్లని దేవుడు పటం లా భావించి పూజించుకునే వారు అప్పటి ప్రేక్షకులు.’లవకుశ’ ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ ‘సీతారామ కళ్యాణం’ ‘శ్రీరామ పట్టాభిషేకం’ వంటి సినిమాల్లో శ్రీరామునిగా మెప్పించారు ఎన్టీఆర్.

3)శోభన్ బాబు : తొలినాళ్లలో శోభన్ బాబు సైతం శ్రీరాముని పాత్రలో కనిపించారు. బాపు దర్శకత్వం వహించిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో శోభన్ బాబు శ్రీరామునిగా, చంద్రకళ సీతగా నటించి మెప్పించారు. ‘సంపూర్ణ రామాయణం’ కూడా ఓ క్లాసిక్ అని చెప్పాలి.

4)అక్కినేని నాగేశ్వరరావు : 1942 లో ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించిన ‘శ్రీ సీతారామ జననం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు శ్రీరాముడి పాత్రని పోషించారు. హీరోగా కూడా ఏఎన్ఆర్ కి ఇది తొలి చిత్రం కావడం విశేషం. అయితే అప్పట్లో ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది. రామాయణానికి పూర్తి విరుద్ధంగా ఈ సినిమా కథ, కథనాలు,పాత్రలు ఉంటాయని చాలా మంది చెబుతుంటారు.

5) కాంతారావు : 1968 లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ‘వీరాంజనేయ’ సినిమాలో శ్రీరాముని పాత్రలో కాంతారావు నటించారు.

6)సుమన్ : అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో రూపొందిన ‘శ్రీరామదాసు’ సినిమాలో సుమన్ శ్రీరాముని పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

7)శ్రీకాంత్ : కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘దేవుళ్ళు’ సినిమాలో శ్రీకాంత్ ఆ భద్రాచల రామయ్యగా కాసేపు కనిపిస్తారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

8) నందమూరి బాలకృష్ణ : బాపు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నందమూరి బాలకృష్ణ శ్రీరాముని పాత్రలో నటించి మెప్పించారు. సీతా దేవిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే.

9)జూ.ఎన్టీఆర్ : గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘బాల రామాయణం’ సినిమా రూపొందింది. ఈ సినిమాతో జూ.ఎన్టీఆర్ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో అతను శ్రీరాముని పాత్రలో నటించి మెప్పించాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

10) ప్రభాస్ : ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ శ్రీరాముని పాత్ర పోషించాడు. సినిమా అయితే అంతగా ఆడలేదు.

ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వారణాసి’ సినిమాలో కూడా మహేష్ బాబు శ్రీరాముని పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #lord rama
  • #Tollywood
  • #Tollywood Actors
  • #Tollywood Actors Who Played Lord Rama Role
  • #Tollywood Heroes

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

18 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 hour ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version