హీరోలకు వీరాభిమానులు వుంటారు. తమ బాడీపై హీరో పేరు లేదా బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకుని అభిమానం తెలియజేస్తారు. హీరోయిన్లకు కూడా అభిమానులు వుంటారు. కానీ, హీరోయిన్ పేరు లేదా రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్న అభిమానులు తక్కువ వుంటారని చెప్పుకోవాలి. తమిళనాడులో ఖుష్బూ, నమిత, హన్సికకి గుళ్ళు కట్టారు. తెలుగులో ఎవరు అలా చెయ్యలేదు. రెండేళ్ళ క్రితం పూజా హెగ్డే అభిమాని ఒకరు చేతిపై ఆమె పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇటీవల హీరోయిన్ పూర్ణ అభిమాని ఒకరు
పూర్ణకి త్రివేండ్రంలో ఉండే అదిత్ చంద్రన్ వీరాభిమాని. ఇప్పటికి ఆమెను చాలాసార్లు కలిశాడు. పూర్ణను సోదరిగా చూస్తారు. ఆమె కూడా అతడిని తన సోదరుడి అని, మా కుటుంబంలో ఒకడు అని చెబుతూ వుంటుంది. ఎనిమిది నెలల క్రితం ఎడమ చేతిపై పూర్ణ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అదిత్ చంద్రన్. ఇప్పుడు కుడిచేతిపై ఏకంగా పూర్ణ రూపాన్ని టాటూ రూపంలో వేయించుకున్నాడు. అది చూసి పూర్ణ ‘నీలాంటి బ్రదర్ ఉండటం నా అదృష్టం. కానీ, నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు’ అని అతడికి చెప్పారు.
పూర్ణ రూపాన్ని చేతిపై టాటూగా వేయించుకోవడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టిందని అదిత్ చంద్రన్ తెలిపారు. తన మొదటి టాటూ పూర్ణ పేరు అని, రెండో టాటూ పూర్ణ ఫోటో అని అతడు పేర్కొన్నాడు. తెలుగులో ‘సీమ టపాకాయ్’, ‘లడ్డుబాబు’, ‘నువ్వలా నేనిలా’, ‘అవును’, ‘అవును 2’, ‘రాజుగారి గది’, ఇంకా కొన్ని సినిమాల్లో పూర్ణ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ప్రజెంట్ సినిమాలు చేస్తూనే ‘ఢీ’ షో జడ్జ్ గా చేస్తోంది.