‘తపన’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘నేను’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘యమదొంగ’ ‘ఖలేజా’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అర్చన శాస్త్రి. నిజానికి చెప్పాలంటే.. ఈమె నటిగా కంటే ‘బిగ్ బాస్ సీజన్ 1’ కంటెస్టెంట్ గానే ఎక్కువ పాపులర్ అయ్యింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి.. సక్సెస్ లు లేకపోవడంతో సైడ్ క్యారెక్టర్లకు పడిపోయింది. ఇక అలాంటి పాత్రలతోనైనా సక్సెస్ అయ్యిందా అంటే.. అది కూడా లేదు. ‘బిగ్ బాస్’ టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచినా ఈమెకు ఆఫర్లు రావట్లేదు.
ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్ గా తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ దర్శక నిర్మాతల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. అయితే ఆ పప్పులు కూడా ఉడకలేదు. ఇక తనకి అసలు పోయినట్టు ఉన్నాయి… తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. అర్చన నుదిటి పై ఆమె బాయ్ ఫ్రెండ్ ముద్దు పెడుతూ.. ఉండగా తన స్నేహితురాలు ఫోటో తీసింది. ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘సైలెంట్ గా ఉన్న సమయంలోనే కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. త్వరలోనే మీకు ఓ గొప్ప వార్తని తెలియజేస్తా. అంతవరకు ఈ ఫొటోలతో ఎంజాయ్ చేయండి’ అంటూ పేర్కొంది అర్చన. త్వరలో చెప్పబోయేది ఆమె పెళ్ళి వార్తే అని అందరూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.