స్కూల్ డ్రస్సుల్లోనూ కేక

  • July 16, 2016 / 07:25 AM IST

సినీ తారల సోయగాన్ని మరింత అందంగా చూపించేవి డ్రస్సులే. అందుకే హీరోయిన్లు ఫ్యాషన్ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటుంటారు. లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ.. తమను ఎక్కువమంది ఫాలో అయ్యేలా చేసుకుంటారు. కానీ కొందరు స్కూల్ యూనిఫామ్ లోను క్యూట్ గా కనిపించి ఆకట్టుకున్నారు. ఏ డ్రస్సులో నైనా మేం అందంగానే ఉంటామని నిరూపించుకున్నారు.

సమంత

క్యూట్ కి పర్యాయ పదం సమంత. ఆమె మాట్లాడుతుంటే అప్పుడే టీనేజ్ లోకి అడుగు పెట్టిన అమ్మాయిలా కనిపిస్తుంది. ఇదే ఆమె స్పెషల్. అలాంటి అమ్మాయి “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలో
వైట్ అండ్ బ్లూ యూనిఫామ్ ధరించి.. అచ్చమైన విద్యార్థినిలా ఆకట్టుకుంది.

హన్సికతెల్లని పాలు లాంటి స్కిన్ టోన్ కలిగిన ముద్దుగుమ్మ హన్సిక. తెలుగు, తమిళ్ చిత్రాల్లో బిజీగా ఉంది. సూర్య సింగం కి సీక్వెన్స్ గా తీసిన సింగం 2 సినిమాలో హన్సిక విద్యార్ధినిగా పంజాబీ డ్రస్సులో కనిపించి మురిపించింది.

అమలాపాల్

మైనా సినిమాలో అమలాపాల్ సహజంగా నటించి నేచురల్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. డీ గ్లామరైజ్ పాత్రలు ఇష్టంగా చేసే ఈ కేరళ కుట్టి మలయాళం “మిలి” చిత్రంలో బడికి వెళ్లే అమ్మాయిగా నటించింది. ఆ పాత్రలో ఒదిగిపోయి మెప్పించింది. అందానికి ఫ్యాషన్ వేర్ తో అవసరం లేదని మరోసారి నిరూపించింది.

నందిత

స్కిన్ షో కు దూరంగా ఉండే నటి నందిత. ప్రేమ కథా చిత్రమ్ లో అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అదే మూవీలో కాలేజీ విద్యార్ధినిగా యూనిఫామ్ లో కనిపించి అభినందనలు అందుకుంది.

రకుల్ ప్రీతి సింగ్
ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీతి సింగ్ కెరీర్ తొలినాళ్లలో ప్లస్ 2 విద్యార్ధినిగా నటించింది. కరెంట్ తీగ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ యూనిఫామ్ లో ముద్దుగా ప్రేక్షకులను బుట్టలో పడేసింది.

శృతిహాసన్

జీరో సైజ్ బ్యూటీ శృతిహాసన్ మరింత సన్నపడి నటించిన సినిమా త్రీ. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో శృతి ఇంటర్ విద్యార్ధినిగా సిగ్గులొలికింది. శెభాష్ అనిపించుకుంది. ఏ డ్రస్సులోనైనా తన అందం తగ్గదని చాటింది.

శ్రీదివ్య

బాల్యనటి నుంచి తెలిసిన అమ్మాయి శ్రీ దివ్య. మచ్చలేని నటనతో మంచి మార్కులు కొట్టేస్తోంది. రీసెంట్ గా వచ్చిన పెన్సిల్ చిత్రంలో ఎక్కువసేపు యూనిఫామ్ లో కనిపించి ఆకట్టుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus