సినిమా వాళ్ళ జీవితాలు చాలా కలర్ ఫుల్ అని అంతా అనుకుంటారు. కానీ వాళ్ళ రిస్క్ ఇంకొకరికి ఉండదు అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వీళ్ళు ఒళ్లు హూనమైపోయెలా.. కష్టపడుతుంటారు. అక్కడ ఏమాత్రం గాయాలపాలైనా సర్జరీలు, నెలల పాటు బెడ్ రెస్ట్ లు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళకి వచ్చే పారితోషికం కూడా అందులో చాలా వరకు పెట్టాల్సి వస్తుంది. స్టార్ హీరోలకు, హీరోయిన్ లకి ఈ ప్రాబ్లం ఉండదు.
అదే చిన్న హీరోలు, హీరోయిన్లు అయితే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చులో సగం చెల్లించాలి… మిగిలింది నిర్మాణ సంస్థ చెల్లిస్తుంది అని కొంతమంది నటీనటులు చెప్పారు. సరే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే త్వరలో ముఖచిత్రం… అనే సినిమా రాబోతుంది. ఇందులో హీరోయిన్లుగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు నటిస్తున్నారు. అయితే అయేషా ఖాన్ ను ముంబై నుండీ తీసుకొచ్చారట. ఈ సినిమా షూటింగ్ లో ఈమెకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందట.
కార్ యాక్సిడెంట్ సీన్ చిత్రీకరిస్తున్న టైంలో ఆమెకు అనుభవం లేకపోవడం వల్ల నిజంగానే గాయపడిందట. దీంతో నడుము, వెన్ను భాగంలో పెద్ద గాయం తగిలింది. కాకపోతే ఈమె తక్కువ బరువు ఉండడంతో త్వరగా కొలోకుందని, లేదంటే జీవితాంతం వీల్ చెయిర్ లో కూర్చోవాల్సి వచ్చేదని ఈ చిత్రం దర్శకుడు గంగాధర్, కథ, మాటలు స్క్రీన్ ప్లే విభాగానికి పనిచేసిన సందీప్ రాజ్..
లు చెప్పుకొచ్చారు. ఇక ఆమె ఈ చిత్రంలో చాలా బాగా నటించిందని.. భవిష్యత్తులో ఆమెకు మంచి ఆఫర్లు వస్తాయని కూడా వాళ్ళు తెలిపారు. ఇక ముఖ చిత్రం సినిమా డిసెంబర్ 9 న రిలీజ్ కాబోతుంది. విశ్వక్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడు. కీరవాణి తనయుడు కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందించాడు