Nagarjuna: ఆ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..?

Advertisement

ఆర్.ఎక్స్100 సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ గుర్తింపును సంపాదించుకున్నారు. బోల్డ్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇచ్చిన పాయల్ కు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి బంగార్రాజు సినిమాలో పాయల్ ఐటెం సాంగ్ చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ వార్తను నిజమేనని నమ్మారు.

అయితే పాయల్ మాత్రం తాను ఐటెం సాంగ్ లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పుకొచ్చారు. బంగార్రాజు సినిమా పేరు డైరెక్ట్ గా చెప్పకపోయినా పరోక్షంగా ఆ సినిమాలో తాను సాంగ్ చేయడం లేదని పాయల్ స్పష్టతనిచ్చి నాగార్జునకు ఝలక్ ఇచ్చారు. ఐటెం సాంగ్ చేస్తే హీరోయిన్ గా ఆఫర్లు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉందని పాయల్ భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఐటెం సాంగ్స్ చేయకూడదని పాయల్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతోంది.

సోగ్గాడే చినినాయన సినిమాతో నాగార్జున 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించారు. ఆ సినిమా తర్వాత నాగ్ నటించిన సినిమాలు ఆ స్థాయిలో హిట్ కాలేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చాలా రోజుల క్రితమే బంగార్రాజు స్క్రిప్ట్ ను సిద్ధం చేయగా ఆగష్టు నుంచి ఈ సినిమా షూటింగ్ జరగనుంది. బంగార్రాజు సినిమా నాగార్జున సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తైతే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. రమ్యకృష్ణ, నాగచైతన్య, సమంత ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus