Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Tollywood celebrities divorce: సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!

Tollywood celebrities divorce: సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!

  • October 5, 2021 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood celebrities divorce: సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!

పెళ్లిళ్లు అనేవి స్వర్గంలోనే నిశ్చయించబడతాయి అంటుంటారు పెద్దవాళ్ళు. మాంగళ్య బంధం అనేది వారిని కలకాలం కలిపి ఉంచుతుంది అని కూడా అంటుంటారు. కానీ కొన్ని జంటలు ఎందుకు విడిపోతాయి అనేది అంతుచిక్కని ప్రశ్న.విడిపోయే జంటలు కూడా స్వర్గంలో నిశ్చయించబడతాయా? అక్కడ కూడా కోర్టులు, జడ్జిలు అనేవి ఉంటాయా? అంటే మన దగ్గర సమాధానం లేదు

కానీ… విడాకులు తీసుకునే జంటలు కూడా ఈ భూమ్మీద ఎక్కువే ఉన్నాయి.ఇంకా చెప్పాలి అంటే రోజురోజుకి పెరుగుతున్నాయి. ఒకే పరిశ్రమకి చెందిన వాళ్ళు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని కూడా విడిపోతున్నారు. మిగిలిన పరిశ్రమల గురించి చెప్పుకోవడం సాధ్యపడదు కానీ..ప్రస్తుతానికి అయితే టాలీవుడ్ లో అయితే ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిన సెలబ్రిటీలు ఎవరు అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1. శారద-చలం:

అలనాటి నటి శారద ఒకప్పటి హీరో చలం గారిని ప్రేమించి 1972లో పెళ్లి చేసుకుంది. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 1984లో విడిపోయారు.

2. శరత్ బాబు -రమప్రభ:

శరత్ బాబు, రమాప్రభ ఇద్దరూ కూడా ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా చక్రం తిప్పిన వాళ్ళే. శరత్ బాబు అయితే హీరోగా కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని 1974లో పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 1988 లో విడిపోయారు.

3. కమల్ హాసన్- సారిక:

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మొదట డ్యాన్సర్ అయిన వాణి గణపతిని 1978లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పది సంవత్సరాలు కలిసి సంతోషంగా గడిపారు. బాబు కూడా పుట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల 1988లో విడాకులు తీసుకున్నారు. తర్వాత తనతో నటించిన హీరోయిన్ సారికను కమల్ ప్రేమించి 1988లోనే రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి శృతి హాసన్, అక్షర హాసన్ లు సంతానం.అయితే ఊహించని విధంగా రెండో భార్య సారికతో కూడా 2004లో విడాకులు తీసుకున్నాడు కమల్. అటు తర్వాత హీరోయిన్ గౌతమితో సహజీవనం చేశారు. తర్వాత ఆమెతో కూడా విడిపోయాడు.

4. ప్రకాష్ రాజ్ – లలిత కుమారి:

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తమిళ నటి లలిత కుమారిని ప్రేమించి 1994లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.అయితే కొన్ని మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2009లో విడిపోయారు. తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ని 2010లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికో పాప ఉంది.

5. సిద్దార్థ్- మేఘన:

వీరిద్దరూ 2003 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వలన 2007 లో విడిపోయారు.

6. నాగార్జున-లక్ష్మీ:

అక్కినేని నాగార్జునకి… మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ అయిన డి.రామానాయుడు కుమార్తె లక్ష్మీతో 1984లో వివాహమైంది. కానీ 1990 లో వీరి బంధం తెగిపోయింది.

7. సుమంత్-కీర్తిరెడ్డి:

అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగార్జున మేనల్లుడు సుమంత్ యార్లగడ్డ మావయ్య దారిలోనే సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డి తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఈ జంట జీవితం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత ఇద్దరికి పోసకపోవడం, సుమంత్ సోదరి సుప్రియతో కూడా విబేధాలు రావడంతో పెళ్లయిన రెండేళ్లకే 2006లో విడాకులు తీసుకున్నారు.

8. సుప్రియ యార్లగడ్డ- చరణ్ రెడ్డి:

అక్కినేని వంశానికే చెందిన సుప్రియ మావయ్య నాగార్జున, అన్నయ్య సుమంత్ దారిలో ప్రేమ వివాహం చేసుకుంది. ఇష్టం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెడ్డిని ఈమె ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్యంగానే ఉన్న ఈ జంట ఓ పాపకి కూడా జన్మనిచ్చారు. అయితే ఆ తర్వాత చరణ్ చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. ఎంత చెప్పినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో విడాకులిచ్చేసింది సుప్రియ. ఆమెతో విడిపోయిన తర్వాత కూడా చరణ్‌లో ఎలాంటి మార్పు రాకపోగా, వ్యసనాలకు మరింత దగ్గరై… ప్రాణాలను కోల్పోయాడు.

9. పవన్ కల్యాణ్- రేణూ దేశాయ్:

పవర్‌స్టార్‌గా, యూత్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ సైతం ప్రేమలో పడ్డాడు. ‘బద్రి’ సినిమా షూటింగ్‌లో ఉత్తరాదికి చెందిన రేణూ దేశాయ్‌ని ప్రేమించి..డేటింగ్ తర్వాత ఆమెను వివాహాం చేసుకున్నాడు. ఆయనకు అప్పటికే విశాఖకు చెందిన నందినితో పెళ్లయ్యింది.అయితే కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది.రెండో పెళ్లిలో పక్క రాష్ట్రానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన పవర్ స్టార్.. మూడోసారి ఏకంగా విదేశీయురాలి ప్రేమకు దాసోహమయ్యాడు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘తీన్‌మార్’సినిమా సమయంలో రష్యా పౌరురాలు అన్నా లెజ్‌నోవాను పెళ్లి చేసుకున్నారు.

10. నాగచైతన్య-సమంత:

అక్కినేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నవయువ సామ్రాట్ నాగచైతన్య. ప్రేమ కథలు, రోమాంటిక్ జోనర్స్‌లో తాత, తండ్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా నటిస్తూ యూత్‌లో లవర్ బాయ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో తండ్రిలాగే ప్రేమ వివాహానికే చైతు మొగ్గు చూపాడు. ‘ఏమాయ చేశావే’ లో తనతో పాటు నటించిన సమంతతో ప్రేమలో పడిన నాగచైతన్య.. లాంగ్ రన్‌లో డేటింగ్ చేసి పెద్దల అంగీకారంతో సమంతని 2017లో పెళ్లి చేసుకున్నాడు. సమంత కేరళకు చెందిన క్రిస్టియన్ అమ్మాయి. కాగా, చైతు తెలుగబ్బాయి. వీరిద్దరూ పెళ్లి విషయంలో తమ రెండు మత సంప్రదాయాలను పాటించారు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా వీళ్ళు ఈ ఏడాది(2021) లో విడిపోయారు.

11. ఝాన్సీ – జోగినాయుడు:

ఇద్దరూ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకునేవారు. తర్వాత వీళ్ళ పరిచయం ప్రేమగా మారడం.. పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత వీరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala
  • #charan
  • #Jhansi
  • #jogi naidu
  • #Kamal Haasan

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version