అల్లు అర్జున్ టు రామ్.. ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోల లిస్ట్..!

ఇటీవల మన టాలీవుడ్ స్టార్ హీరోలైన రాంచరణ్, మహేష్ బాబు, ప్రభాస్ ల మధ్య చిన్న పోటీ జరిగింది. అందులో రాంచరణ్ గెలిచాడు. ఇంతకీ ఏంటి ఆ పోటీ అనుకుంటున్నారా.. వీరి ముగ్గురి ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజెస్ 9 మిలియన్ ఫాలోవర్స్ కు దగ్గరయ్యాయి. అయితే ఎవరు ఫస్ట్ 9మిలియన్ కొడతారు అనే ఉత్కంఠత నెలకొంది. ఫైనల్ గా రాంచరణ్… పోటీలో ఉన్న ప్రభాస్, మహేష్ లను వెనక్కి నెట్టి.. ముందుగా 9 మిలియన్ సాధించాడు. తర్వాత ప్రభాస్, మహేష్ లు కూడా 9మిలియన్ ఫాలోవర్స్ ను సాధించారు అనుకోండి. ఏదేమైనా ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా నిలిచింది.అప్పటి నుండి అసలు ఇన్స్టాగ్రామ్ లో ఏ హీరోకి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే మన టాలీవుడ్ హీరోల్లో అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను కలిగిన హీరోలు ఎవరో.. ముఖ్యంగా టాప్ 10 లో ఉన్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) అల్లు అర్జున్ :

టాలీవుడ్ హీరోల్లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన హీరోగా బన్నీ టాప్ ప్లేస్ లో నిలిచాడు. అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 19.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.’పుష్ప’ తో నార్త్ లో కూడా అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు కాబట్టి ఇతని ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. రేపో మాపో 20 మిలియన్ మార్క్ ను అందుకుంటాడు బన్నీ.

2) విజయ్ దేవరకొండ :

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 17.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతనికి కూడా నార్త్ లో మంచి క్రేజ్ ఉంది.

3) రాంచరణ్ :

మన మెగా పవర్ స్టార్ చరణ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 9.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో చరణ్ కు కూడా పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది.

4) ప్రభాస్ :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఏదో ఆఫీషియల్ అకౌంట్ ఉందనే పేరే కానీ అసలు ప్రభాస్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ గా ఉండడు.

5) మహేష్ బాబు :

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ ఖాతాకి కూడా 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను ట్విట్టర్లో ఉన్నంత యాక్టివ్ గా ఇన్స్టాగ్రామ్లో ఉండడు అనే చెప్పాలి.

6) నాగ చైతన్య :

అక్కినేని నాగ చైతన్య ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 7.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సమంతతో కలిసున్నంత వరకు ఇతనికి ఫాలోవర్స్ ఓ రేంజ్లో పెరిగారు. ఇప్పుడైతే తగ్గిపోయారు.

7) నాని :

నేచురల్ స్టార్ నాని ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 5.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు

8) ఎన్టీఆర్ :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు

9) రానా :

దగ్గుబాటి రానా ఇన్స్టాగ్రామ్ ఖాతాకి కూడా 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు

10) రామ్ పోతినేని :

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus