ప్రస్తుతం సినిమా అంటేనే పైసా వసూళ్లు చేసే వ్యాపారం అన్నది చిన్న పిల్లాన్ని అడిగిన చెబుతాడు. అయితే టెక్నాలజీ పెరిగిపోయి మనం ముందుకు పోతున్నామో, లేక పరిస్థితులు, పద్దతులు దాటి హాద్డులు దాటిపోతున్నామో తెలీదు కానీ మొత్తానికి సభ్యసమాజం సిగ్గుపడేలా, కుటుంబ సమేతంగా చూడలేని సినిమాలను ఎన్‌కరేజ్ చేస్తూ పండగ చేసుకుంటున్నాం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, సినీ ప్రపంచాన్ని ఒక వ్యాపార ప్రపంచగా మార్చి పద్దతుల గీతలు చెరిపివేస్తూ, హద్దులు దాటుకుంటూ డబ్బులు దండుకుంటున్నాం.
ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి మరీ సినిమా బిజినెస్ ను తారా స్థాయికి చేరేల మనమే ఆదరిస్తున్నాం. ఉదాహరణకు ఒక డర్టీ పిక్చర్, ఒక మర్డర్, తెలుగులో తాజాగా శ్రీదేవి ఇలాంటి సినిమాలను వాటికి చేస్తున్న పబ్లిసిటీ ను చూస్తే అందాల ఆరబోతకు అంతా సిద్దం అన్న ఆలోచన, పోస్టర్ లోనే ఇంత చూపించారంటే సినిమాలో ఇంకెంత ఉందో అన్న ఆతురత ఇలా అన్నీ కలగలిపి అలాంటి చిత్రాలను భారీ హిట్స్ గా మలుస్తున్నాయి. యువతని టార్గెట్ చేస్తూ, మాస్ హృదయాల్లో శృంగార సాంకేతాలకు ఆధ్యం పోస్తూ తాజాగా విడుదలయిన ఒక సినిమా పోస్టర్ చూస్తే మనం ఏ స్థాయిలో దూసుకుపోతున్నామో అర్ధం అవుతుంది. తాజాగా బాలీవు లో ‘ఇండియాస్ బోల్డెస్ట్ అండ్ మోస్ట్ ఎరోటిక్ ఫిలిం’ అని ట్యాగ్ వేసుకుని మరీ వస్తున్న సినిమా….‘ఇష్క్ జునూన్’. ఈ చిత్రం యొక్క ఫర్స్ట్ లుక్ ప్రకంపనలు సృష్టిస్తుంది. దాదాపుగా పూర్తిగా కాకపోయినా….సంపూర్ణ నగ్నత్వంతో ఓ అమ్మాయి చిన్న బ్రా…వేసుకుని…జుట్టుతో ముఖం దాచుకుని ఇద్దరు మగాళ్లను తనవైపు లాక్కుంటూ ఉండగా…మరో పక్క ఆ కండలు తిరిగిన మగ మహారాజులు ఆమె యదపై చేతులు వేసి, ఆ చేతులకు సంకెళ్ళు వేసి, ఆమెకు బంధీ అయిపోయారు అన్నంత మీనింగ్ ఉన్న పోస్టర్. ఇలా తమదైన స్టైల్ ల్లో సినిమా పబ్లిసిటీ ను తీర్చిదిద్ది టాప్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు తాజా ఫిల్మ్ మేకర్స్. ఒకరకంగా చెప్పాలంటే రాబోయే తరానికి ప్రస్తుత సినీ ప్రపంచం ఒక శంకరాభరణం చూపించ లేకపోవచ్చు కానీ, శృంగార తీర్ధాలు మాత్రం చాలానే చూపిస్తుంది అనేది స్పష్టం.
Read Today's Latest
Movie News Update. Get
Filmy News LIVE Updates on FilmyFocus