ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న నగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకున్నా నగ్మాకు కరోనా నిర్ధారణ కావడం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా నగ్మా తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా నగ్మా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం నగ్మా ఇంట్లోనే ఉండి కరోనాకు చికిత్స చేయించుకుంటున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో ప్రముఖ హీరోలకు జోడీగా నటించి నగ్మా మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
నగ్మాకు కరోనా నిర్ధారణ కావడంతో ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ నెల 2వ తేదీన ముంబైలో నగ్మా ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా కేసులు పెరుగుతుండటం ప్రజల్లో చాలామందిని కలవరపెడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,26,000 కేసులు నమోదయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటంతో రాబోయే వారాల్లో రిలీజ్ కాబోయే సినిమాలపై ఆ ప్రభావం పడుతుందని తెలుస్తోంది.
రేపు వకీల్ సాబ్ రిలీజ్ కానుండగా అతి త్వరలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి వస్తే మాత్రం పలు సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ లతో తెరకెక్కిన సినిమాలు కావడంతో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.