వైరల్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో..!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత హీరోయిన్ల అన్ సీన్ పిక్స్ ను సేకరించడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. అదే గతంలో అయితే మ్యాగ్జిన్లలో వచ్చేవరకు చూసేవారు. రూ.10 కి, రూ.25 కి మ్యాగ్జైన్లు కొనుక్కుని మరీ తమకు ఇష్టమైన హీరోయిన్ల ఫోటోలను సేకరించేవారు అభిమానులు. ఇప్పుడైతే ఏదో ఒక సందర్భంలో హీరోయిన్ల అధికారిక ఖాతాల్లో చైల్డ్ హుడ్ పిక్స్ లభిస్తున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో ఆమె చాలా క్యూట్ గా ఉంది. ఈమె ఎవరా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. హిందీ ‘బిగ్ బాస్ 9’ లో ఈమె పాల్గొంది. అయితే తెలుగులో ఎంట్రీ ఇచ్చి 4 సినిమాల్లో నటించింది. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘సీటీమార్’ సినిమాలో కూడా ఈమె నటించింది. ఆమె మరెవరో కాదు దిగంగన సూర్య వంశీ. గ్లామర్ తో పాటు నటనతో కూడా ఈమె ప్రేక్షకులను మెప్పించగలదు.

ఈమె తొలి సినిమా ‘హిప్పీ’ సినిమా ఫెయిల్ అయ్యింది కానీ నటిగా ఈమె ఫెయిల్ కాలేదు. అందుకే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.’సీటీమార్’ లో అయితే స్టార్ హీరోయిన్ తమన్నానే డామినేట్ చేసింది ఈ బ్యూటీ. లేటెస్ట్ గా వచ్చిన ఆది సాయి కుమార్ ‘క్రేజీ ఫెలో’ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం సందీప్ కిషన్ నటిస్తున్న ఓ సినిమాలో కూడా నటిస్తుంది.ఈరోజు ఆమె పుట్టినరోజు. 1997 వ సంవత్సరం అక్టోబర్ 15న ఈమె జన్మించింది. అందుకే సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈమెకు యూత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు..!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus