సినిమా వాళ్ళు.. సహజీవనం అనే మాటలు మనం రోజూ వింటూనే ఉంటాం. పలనా హీరో.. పలానా హీరోయిన్ తో సహజీవనం కొనసాగిస్తున్నాడు అంటూ అనేక వార్తలు నిత్యం వస్తుంటాయి. ఈ సహజీవనం అనే కాన్సెప్ట్ అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలోనే ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది. ఇది విదేశీ సంస్కృతి అనే విషయం జనాలు గుర్తించరు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ తన చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
ఆమె పేరు అనురాధ.గత 3 నెలలుగా ఆమె కిరణ్ అనే యువకుడితో సహజీవనం సాగిస్తూ వస్తోంది.ఫిలింనగర్ సమీపంలోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్‌లో ఉన్న ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకుని వీరి సహజీవనం కొనసాగిస్తూ వచ్చారు. కానీ కిరణ్.. అనురాధకు తెలీకుండా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో అనురాధ కంట పడకుండా అతను వదిలుంచుకోవడానికి ట్రై చేసాడట. విషయం ఆలస్యంగా గ్రహించిన అనురాధ ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తుంది.
ఇక అనురాధ గది నుండీ దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానం వచ్చి వెళ్లి చూస్తే అక్కడ అనురాధ మృతదేహం ఉంది. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక అనురాధ సోదరి పోలీసులని సంప్రదించి కిరణ్ గురించి మరిన్ని వివరాలు తెలిపినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో పోలీసులు కిరణ్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉండగా.. అనురాధ వయసు కేవలం 22 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులోనే ఆమె చనిపోవడం అందరినీ విషాదంలోకి నెట్టేసే విషయం.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!