కరోనాను సైతం లెక్కచేయకుండా ఈమధ్యకాలంలో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. బంధువుల సంఖ్య తగ్గింది కానీ.. హడావుడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ కొన్నాళ్ల వరకు ముహుర్తాలు లేవని జరుగుతున్న ఈ పెళ్లిళ్లు కొన్ని తీపి జ్ఞాపకాలుగా మిగులుతుంటే.. కొన్ని మాత్రం చేదు జ్ఞాపకాలను మిగులుస్తున్నాయి. ఆ కోవలోకి వచ్చింది ఇప్పుడు ఓ సెలబ్రిటీ మ్యారేజ్. ఇటీవల ఘనంగా జరిగిన ఓ సెలబ్రిటీ పెళ్లి కరోనా హాట్ స్పాట్ గా మారింది.
ఆ పెళ్లి ఎవరిది అనేది చర్చించడం ప్రస్తుతానికి అప్రస్తుతం మరియు బాగోదు కూడా కాబట్టి చెప్పడం లేదు. అయితే.. ఈ మ్యారేజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన వాళ్లలో ఆరుగురికి ఆల్రెడీ కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ పెళ్ళికి అటెండ్ అయిన స్టార్లు, సెలబ్రిటీలు కంగారుపడి.. ఇమ్మీడియట్ గా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఎలాగూ లాక్ డౌన్ పద్ధతులను కూడా పాటిస్తున్నారు.
దాంతోపాటు హంగామా తగ్గించి వీలైనంత నిరాడంబరంగా పెళ్లి చేసుకొని వీలైనంత తక్కువమంది అటెండ్ అయ్యేలా చూసుకుంటే మంచిది. రానా తన పెళ్ళికి అదే పని చేసాడు తన బాగా క్లోజ్ అనుకున్న వాళ్లకి తప్ప మిగతావారి కోసం తన పెళ్లి వేడుకను యూట్యూబ్ లైవ్ ఇచ్చాడు. ఈ పద్ధతిని అందరు సెలబ్రిటీలు ఫాలో అయితే బెటర్.