హీరో నాని, విక్రమ్ కుమార్ సినిమాలో విలన్ అతడేనా?

  • December 1, 2018 / 02:08 PM IST

తెలుగు పరిశ్రమలో వరుస విజయాలను సాధించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొని న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు హీరో నాని. అయితే కథల విషయంలో జాగ్రత్తగా ఉండే నాని గ్యాప్ లేకుండా సినిమాలను వరుసగా లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా షూటింగ్ లో ఉండగా ఆ తరువాత ‘ఇష్క్’, ‘మనం’, ‘24 ‘ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోనున్నాడు. ఈ సినిమా పూర్తి స్థాయి థ్రిల్లర్ గా రూపొందబోతుంది. ప్రస్తుతం డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండగా ఒకప్పటి లవర్ బాయ్ ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడనే వార్త బయటికి వచ్చింది.

తెలుగులో బాయ్స్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘ఓయ్’ వంటి హిట్ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన హీరో సిద్దార్థ్. ఆ తరువాత వరుస పరాజయాల కారణంగా ఛాన్సులు తగ్గడంతో కొన్ని రోజులు పూర్తిగా సినిమాలకి దూరం ఉండగా, గృహం సినిమాతో మళ్ళీ చాలా గ్యాప్ తరువాత కనిపించాడు. ఇక సిద్దార్థ్, నాని సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. మరి సిద్దార్థ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచిపేరు తెచ్చుకోగా ఈ సినిమాలో విలన్ గా నటించి ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus