లేడీ గెటప్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన హీరోలు

సినీ హీరోలు కథను ఓకే చెయ్యాలంటే అది తమ అభిమానులకు ఎంత వరకు నచ్చుతుందో ఆలోచిస్తారు. తమ ఇమేజ్ కి ఇబ్బంది కలిగించే సన్ని”వేషాలుంటే” తీసేస్తారు. అలాంటిది ఆడవేషంలో కనిపించాలంటే జంకుతారు. లేడి గెటప్ లో ఎలా కనిపిస్తామేమోనని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటారు. కొందరు మాత్రం ఆ వేషం కథకు తప్పని సరి అనుకుంటే సాహసం చేస్తున్నారు. ఇలా హీరోలు అమ్మాయిలా కనిపించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాయి.

భామనే .. సత్య భామనేవిశ్వనటుడు కమల్ హాసన్ తన నటనతో ప్రపంచ సినీ అభిమానులనూ అలరించారు. ఆయన ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. మధ్య వయసు స్త్రీ గా “భామనే .. సత్య భామనే” చిత్రంలో కమల్ కనిపించారు. మనస్పర్ధలతో కమల్, మీనా విడిపోతారు. మీనా వద్ద ఉన్న కూతురుని చూడకుండా ఉండలేక కమల్ ఈ వేషం వేస్తారు. నవ్వులు పూయించారు. చివరకు ఆలుమగలు కలిసిపోయి కూతురికి మంచి తల్లిదండ్రులుగా నిలుస్తారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

చంటబ్బాయిచిరంజీవి హాస్య చిత్రాల్లో చంటబ్బాయి ఒకటి. ఇందులో చిరు డిటెక్టివ్ గా చేసే హడావుడి అంత ఇంత కాదు. సుహాసినిని అనుసరించే క్రమంలో వచ్చే “నేనో ప్రేమ పూజారి” అంటూ పాట అందుకుంటారు. ఈ పాటలో మెగాస్టార్ ఒక నిముషం పాటు అమ్మాయిగా కనిపిస్తారు. తెల్లగౌనులో అందమైన యువతిలా కనువిందు చేశారు. మహిళా ప్రేక్షకులు పడి పడి నవ్వారు. కనక వర్షం కురిపించారు.

చిత్రం భళారే విచిత్రంబ్యాచిలర్ కి అద్దె ఇల్లు దొరకడం కష్టంగా ఉండడంతో .. రాజాగా ఉన్ననరేష్ ప్రేమగా వేషం వేస్తారు. మరింత కష్టాల్లో పడతారు. సుధాకర్ భార్యగా తిప్పలు పడుతూ హాస్యాని పండించారు. 1991 లో వచ్చిన చిత్రం భళారే విచిత్రం లో నరేష్ నటన సినిమా వంద రోజులు పండగ చేసుకోవడానికి దోహదం చేసింది. ఈ చిత్రానికి నరేష్ నంది అవార్డ్ కూడా అందుకున్నారు.

మేడమ్నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మేడమ్ సినిమాలో మేడమ్ సరోజినీ వేషం వేశారు. ఒకటి రెండు నిముషాల్లో లేడీ గా నటించడమంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. టైటిల్ రోల్ పోషించడం అంటే కత్తి మీద సాములాంటిదే. ఈ సాహసంలో రాజేంద్ర ప్రసాద్ కూడా విజయం సాధించారు. ప్రసాద్, సరోజినీ, మందాకిని పాత్రలను చక్కగా పోషించారు. హిట్ కొట్టారు.

గంగోత్రికొన్ని సినిమాల్లో తమ నటనను ప్రూవ్ చేసుకున్నతర్వాత ఎవరైనా ఆడ వేషం వేయడానికి ముందుకొస్తారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తొలి చిత్రంలోనే విద్యార్ధినిగా కనిపించాడు. అమ్మాయిగా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. గంగోత్రి సినిమాలో హీరోగా పరిచయమై ఒక పక్క పాటలు, ఫైట్ లతో అదరగొట్టి, మరో పక్క అమ్మాయిగా ఫన్ క్రియేట్ చేసాడు. విజయం అందుకున్నాడు.

పాండవులు పాండవులు తుమ్మెదమంచు విష్ణు, మంచు మనోజ్ నిర్మాతలగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద. ఇందులో మంచు మనోజ్ హాట్ భామ మోహినిగా కేక పుట్టించాడు. కైపు చూపులు, వయ్యారి నడకలతో సెక్సీ భామలకు పోటీ ఇచ్చాడు. సినిమా హిట్ కాక పోయిన మంచు మనోజ్ మోహినిగా కనిపించిన సీక్వెన్స్ లో థియేటర్ మొత్తం విజువల్స్ తో నిండిపోయింది.

పాండురంగడునటసింహా బాలకృష్ణ భామగా ఒక సినిమాలో మెరిశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన పాండురంగడు సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తూనే కాసేపు అందాల సుందరిగా బాలకృష్ణ కనిపిస్తారు. బాలయ్య యువతిగా హొయలు పోతూ నడుస్తూ ఉంటే అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేక పోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus