“ఆర్ ఎక్స్ 100” చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు కార్తకేయ. తాజాగా ఫేస్ బుక్ లైవ్ చాట్ చేశాడు. మీ అభిమాన హీరోయిన్ ఎవరు అని అడగగా “పోకిరి” సినిమా చూడనంతవరకూ నేను రమ్యకృష్ణను ఎంతగానో అభిమానించేవాడిని, “పోకిరి” చూసిన తరువాత ఇలియానా అభిమానిగా మారిపోయాను. ఇలియానా అంటే నాకు పిచ్చి. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పిచ్చి అలాగే వుండిపోయింది” అని చెప్పుకొచ్చాడు. ఇక ఒక అభిమాని పాయల్ గురించి అడగ్గా .. “ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ .. చాలా చక్కగా నటిస్తుంది .. భవిష్యత్తులో ఆమె పెద్ద హీరోయిన్ అవుతుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చాడు.
కార్తికేయ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉండగా.. ఛాన్స్ వస్తే గనుక ఇలియానాతో తప్పకుండా యాక్ట్ చేస్తానని కార్తికేయ చెప్పడం విశేషం. ఇకపోతే.. ఇలియానా ప్రస్తుతం “అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమాలో నటిస్తూ బిజీగా ఉండగా.. మరికొన్ని సినిమాలు కూడా చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈమేరకు తనతోటి ఇదివరకు నటించిన హీరోలందరినీ కాంటాక్ట్ చేస్తుంది. చూస్తుంటే.. ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన ఫ్యాన్ బేస్ ను కాస్త స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకొనే ప్లాన్ లో ఉందన్నమాట.