సినీ పరిశ్రమలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటుడు!

గతేడాది జూలై నుండీ సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.ముఖ్యంగా ఏడాది చివర్లో కృష్ణంరాజు, కృష్ణ , కైకాల సత్యనారాయణ, చలపతి రావు వంటి అగ్ర నటులు మరణించారు. అంతేకాదు చాలామంది నటీనటుల కుటుంబ సభ్యులు, దర్శకులు , నిర్మాతలు, టెక్నీషియన్లు, కూడా మరణించడం జరిగింది. అలాగే పక్క రాష్ట్రాలలోని సినీ ప్రముఖులు సైతం మరణించడం జరిగింది.కనీసం ఈ 2023 లో అయినా అంతా సజావుగా సాగుతుంది అనుకుంటే.. తాజాగా ఓ యువ నటుడు మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అతను ఇలా బలవన్మరణానికి పాల్పడినట్టు స్పష్టమవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సుధీర్ వర్మ .. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు, వంటి సినిమాల్లో నటించాడు. ఇతని మరణానికి చింతిస్తూ.. టాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

నటుడు సుధాకర్ కొమాకుల.. సుధీర్ వర్మ మరణం పై స్పందిస్తూ.. ‘ సుధీర్ చాలా మంచి వ్యక్తి అలాగే నిజాయితీ కలిగిన వ్యక్తి కూడా..! అతను లేడు అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నీతో కలిసి పనిచేసినందుకు నాకు మంచి అనుభూతి కలిగింది బ్రదర్.ఓం శాంతి ‘ అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus