ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి బాక్సాఫీస్ వద్ద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే బడ్జెట్ విషయంలో మాత్రం నిర్మాతలు పెద్దగా డేర్ చేయడం లేదని టాక్. గత కొంతకాలంగా సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఫైనాన్షియర్స్ కూడా రావడం లేదని కథనాలు పూట్టుకొస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ కొందరిని షాక్ కు గురి చేస్తోంది. దర్శకుడు బోయపాటి ఈ ప్రాజెక్ట్ లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం యువ హీరోను సంప్రదించినట్లు టాక్ వస్తోంది. అయితే ఆ హీరో దర్శకుడికి బయపడి రిజెక్ట్ చేసినట్లు టాక్. ఆ హీరో మరెవరో కాదు. యువ హీరో నిఖీల్ సిద్దార్థ్. పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని రిస్క్ చేయడానికి ఇష్టపడలేదట.
ఎందుకంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను బోయపాటి ఎంత భయంకరంగా చూపిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే కొంత భయంగా అనిపించి నిఖీల్ వెనుకడుగు వేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిఖీల్ కార్తికేయ 2 ప్రాజెక్ట్ తో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.