బండ్ల గణేష్ కి కరోనా అన్న న్యూస్ ఒక్కసారిగా టాలీవుడ్ ని షేక్ చేసింది. రోజుకు అనేక వ్యవహారాలు చక్క దిద్దే బండ్ల గణేష్..పలువురిని తరచూ కలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన ద్వారా ఎంత మందికి ఈ కరోనా సోకి ఉంటుంది అనే భయం అందరినీ వేటాడుతుంది. గత వారం రోజుల్లో గణేష్ ని కలిసిన అనేకమంది నటులు, ప్రముఖులు, వ్యాపారాలు, బ్యాంకు సిబ్బంది కరోనా టెస్ట్స్ చేయించుకుంటున్నారట.
ఐతే హీరో నాగ శౌర్య ఇల్లు వదిలి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నాగ శౌర్య మరియు బండ్ల గణేష్ ఒకే గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తెలియడంతో కుటుంబంతో పాటు అక్కడి నుండి వేరే చోటికి నాగ శౌర్య వెళ్లిపోయారట. గేటెడ్ కమ్యూనిటీ అంటే అందులో ఉండే పార్క్, జిమ్ వంటి అనేక కామన్ ప్రాపర్టీస్ లో బండ్ల గణేష్ తిరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండడం సురక్షితం కాదని నమ్మిన, హీరో నాగ శౌర్య ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్లిపోయారట.
ఇక ఈ న్యూస్ తరువాత ఎవరు షూటింగ్స్ కి హాజరయ్యే పరిస్థితి లేదు. ఎలాగైనా షూటింగ్స్ జరపాలని కొందరు ధైర్యం చేయగా వారు కూడా విరమించుకునే అవకాశం ఉంది. ఇక సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ మరియు నాగార్జున లాంటి వారు ఎప్పటికి షూటింగ్స్ లో పాల్గొనకూడని నిర్ణయం తీసుకున్నారు. చిన్నా చితకా చిత్రాలు షూటింగ్స్ కి కూడా బ్రేక్ పడడం ఖాయంగా కనిపిస్తుంది.