కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ను క్లోజ్ చేసిన పోలీసులు!

ఫుట్ పాత్ పక్కన అత్యంత తక్కువ ధరకే ఫుడ్ విక్రయిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇలా ఈమె ఫుడ్ బిజినెస్ కు ఎంతో మంచి పాపులారిటీ రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఎంతో ఫేమస్ అయినటువంటి తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కష్టమర్స్ రావడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి తరుణంలో పోలీసులు ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించారు. ఇలా ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయింది అనే విషయం తెలియడంతో ఈమెకు మద్దతుగా టాలీవుడ్ హీరో సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. గత కొద్ది రోజుల క్రితం హీరో సందీప్ కిషన్ ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు వచ్చి ఈమె ఫుడ్ టేస్ట్ చేశారు.

అయితే ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయిందనే విషయం తెలియడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న కారణంతో ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడం నిజంగా దారుణమని తెలిపారు. ఈమె ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు నిజమైన మహిళా సాధికారత కుమారి ఆంటీ వద్ద నేను చూశానని సందీప్ కిషన్ తెలిపారు.

ఈమెకు (Kumari Aunty)వీలైనంతవరకు నా టీం తో కలిసి నేను సహాయం చేస్తాను అంటూ సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus