డియర్ కామ్రేడ్ ఫ్లాపవ్వడంతో సంబరాలు చేసుకుంటున్నారట

స్టార్ హీరోలందరూ ఇమేజ్ లు, ఫ్యామిలీ స్టేటస్ లు పక్కన పెట్టేసి హ్యాపీగా కలిసిమెలిసి మెలుగుతుండగా.. కుర్ర హీరోల నడుమ ఆ సఖ్యత లోపించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ సరికొత్త సినిమా “డియర్ కామ్రేడ్” ఫ్లాప్ అవ్వగానే.. కొందరు యువ హీరోలు ఏకంగా పార్టీ చేసుకొన్నారట. ఈ విషయం ప్రస్తుతం ఫిలిమ్ నగర్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. సదరు హీరోలు ఎవరు అనే విషయం ఇంకా తెలియదు కానీ.. ఆ బ్యాచ్ అందరూ విజయ్ ఫ్లాప్ ను తెగ సెలబ్రేట్ చేసుకొంటున్నారట.

గతంలో “నోటా” ఫ్లాప్ అయినప్పుడు కూడా ఇలాగే కొందరు పార్టీలు చేసుకోవడం జరిగింది. ఆ విషయం మొత్తానికి విజయ్ దేవరకొండ దాకా వెళ్లింది. యాటిట్యూడ్ కి బాప్ లాంటి విజయ్ ఈ విషయం తెలిసాక సైలెంట్ గా ఉంటాడా.. వెంటనే ఒక పెద్ద లెటర్ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. “సెలబ్రేట్ చేసుకుంటున్నవాళ్ళంతా ఇప్పుడే పండగ చేసుకోండి.. ఐ విల్ బీ బ్యాక్” అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. మరి ఇప్పుడు కూడా విజయ్ స్పందిస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus