పవన్ కల్యాణ్…ట్వీట్ అర్ధం కాలేదు…!

  • September 30, 2017 / 11:24 AM IST

పవన్ కల్యాణ్…ఈ పేరు వింటేనే ఆయన అభిమానులు అభిమానంతో ఊగిపోతారు…ఈ పేరు వింటే ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలి అనుకున్న వారు…జై జనసేన అంటూ నినాదాలు చేస్తారు…మరి అలాంటి పవన్ కల్యాణ్…ట్వీట్ చేస్తే ఒక ప్రభంజనమే…కానీ…ఏ మధ్యనే పవన్ పెట్టిన ఒక ట్వీట్, ఆయన అభిమానులనే కన్ఫ్యూషన్ లో పడేసింది…ఇంతకీ ఏంటి ఆ ట్వీట్ ఏమా కధ అంటే…ప్రజా సమస్యలపై ‘జనసేన’ అధినేతగా పవన్‌ కల్యాణ్ ఎన్నో ట్వీట్ చేశాడు…కానీ లేటెస్ట్ గా పవన్ చేసిన ఒక ట్విట్ పై అయోమయంతో కూడిన కామెంట్స్ మొదలయ్యాయి. పవన్ తనదైన శైలిలో మళ్ళీ గళం ఎత్తాడు. సమస్య పరిష్కారం ఒక గ్రామానికో, జిల్లాకో, ప్రాంతానికో కాదని ఏపీలోని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘కొంతమందికి భూదాహం వుంటుందని ఎన్ని వేల ఎకరాలు సంపాదించినా వాళ్లకి సరిపోదని తనకు దాహం ఉందని, ప్రజా సమస్యలు పరిష్కారించాలని ఉంది’ అని అంటున్నాడు పవన్. ఈ ట్విట్ అర్ధం ఏమిటో అర్ధంకాక పవన్ వీరాభిమానులే అయోమయంలో పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పవన్ ఏదో చెప్పాడు అయితే అది ఏమీ అర్ధం కావడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అంతేకాదు ఈ ట్విట్ సమయం సందర్భం దేని గురించి అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయోమయంలో ఉన్న పవన్ ఈ ట్విట్ తో తన అభిమానులను కూడ అయోమయంలో పడేస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో పవన్ ఎవరికీ అర్ధం కాకుండా మాట్లాడటం తన స్పెషాలిటీ అనే విధంగా తన సంకేతాలు ఇస్తున్నాడు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విట్ వెనుక అర్ధం ఏమిటి అనే విషయమై రాజకీయ వర్గాలలోనే కాకుండా పవన్ అభిమానులలో కూడ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ‘ఓ వైపు స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వరు. ఉద్యోగాలు క్రియేట్‌ చెయ్యరు. ఉన్నవి కూడా తీసేస్తాను అంటే కడుపు మండి అది ఏ రూపం తీసుకుంటుందో’ అంటూ పవన్ పేలుస్తున్న డైలాగులు వెనుక ఆంతర్యం అర్ధంకాక చాలామంది అయోమయంలో ఉన్నారు. మొత్తంగా పవన్ ఒక పక్క ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తునే, మరోపక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూనే, అదే క్రమంలో జనం మధ్యకు వెళ్ళకుండా ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు ఇలా ట్విటర్ లో అప్పుడప్పుడు స్పందిస్తూ ముందుకు సాగుతున్నారు…మరి ఇవన్నీ వదలి ప్రజల్లోకి ఎప్పుడు వస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus