త్రినాథ్ రావు నక్కిన.. నాలుగైదు హిట్లిచ్చినా ఇంకా స్టార్ డైరెక్టర్ కాలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతను తీసిన హిట్టు సినిమాలకు.. ఇతనే దర్శకుడు అని గుర్తించిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నిర్మాతల దగ్గరుండి ఇతనికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఇతని డైరెక్షన్లో సినిమాలు చేసి డబుల్ ప్రాఫిట్స్ అందుకున్న నిర్మాతలు ఉన్నారు. మేకింగ్ విషయంలో కూడా త్రినాథ్… ఎక్కువ బడ్జెట్ పెట్టించడు. అయినా సరే ప్రతి సినిమాకి హీరోని పట్టడానికి..
అందులోనూ స్టార్ హీరోని పట్టడానికి మాత్రం అష్టకష్టాలు పడుతుంటాడు. గతేడాది చివర్లో ‘ధమాకా’ అనే సినిమా వచ్చింది. ఇది యావరేజ్ టాక్ తో కూడా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి త్రినాథ్ స్ట్రాటజీలు చాలా వరకు కారణమని చెప్పాలి. దీంతో త్రినాథ్ కు చిరంజీవి అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ స్క్రిప్ట్ సెట్ అవ్వలేదు అందుకే చిరుతో సినిమా సెట్ అవ్వలేదు. ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన ఓ కుర్ర హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
అతను మరెవరో కాదు నాగ శౌర్య. అతని హోమ్ బ్యానర్ అయిన ‘ఐరా క్రియేషన్స్’ లో 5వ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. నాగ శౌర్య ఈ మధ్య నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. మరోపక్క ఇప్పటివరకు త్రినాథ్ రావు నక్కిన చెక్కిన సినిమాలకు ప్రసన్నకుమార్ బెజవాడ స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసేవాడు. ఇప్పుడు అతనికి డైరెక్షన్ ఛాన్స్ రావడంతో తప్పుకున్నాడు.
ఇప్పుడు ప్రసన్న లేకుండా త్రినాథ్ నిలదొక్కుకోగలడా అనే అనుమానం అందరిలోనూ ఉంది.అందుకే త్రినాథ్ .. ప్రసన్న అండ లేకుండా హిట్టు కొట్టగలడా లేదా అన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ హిట్టు కొడితే మాత్రం త్రినాథ్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.