Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు
- October 7, 2026 / 06:20 PM ISTByPhani Kumar
‘ధమాకా’ తో వంద కోట్ల దర్శకుల లిస్టులో చేరాడు త్రినాధ్ రావ్ నక్కిన(Trinadha Rao Nakkina). కానీ ఆ ఇమేజ్ ను కాపాడుకోవడం అతనికి కష్టం అవుతుంది అనిపిస్తుంది. ‘ధమాకా’ తర్వాత చేసిన ‘మజాకా’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా నిర్మాత సేఫే. కానీ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. త్రినాధ్ రావ్ నక్కినకి హీరోలు దొరకలేదు. అందుకే నిర్మాత కోనేరు సత్యనారాయణ కుమారుడు హవీష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.
Trinadha Rao Nakkina

ఆ సినిమా షూటింగ్ టైమ్లో నిర్మాతగా ‘చౌర్య పాఠం’ అనే సినిమా తీశాడు త్రినాధ్ రావ్ నక్కిన. అది పెద్దగా ఆడలేదు. తర్వాత ‘అనకాపల్లి’ చేశాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న త్రినాథ్ రావ్ నక్కిన.. హుందాగా కొన్ని నిజాలు ఒప్పేసుకున్నాడు. ‘అనకాపల్లి’ సినిమాకి అతను ఓ నిర్మాతగా వ్యవహరించాడు. కానీ తాను సినిమాకి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టలేదని కుండబద్దలు కొట్టాడు.
సినిమాకి డబ్బులు పెట్టేంత సీన్ తనకి లేదని, కేవలం సినిమా బిజినెస్ కోసం, తన పేరు పడితే నలుగురు ఆడియన్స్ వచ్చి సినిమా చూస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే పేరు వేసుకున్నట్టు చెప్పారు త్రినాధ్ రావ్ నక్కిన. అంతేకాదు.. తన వద్దకి ‘డబ్బులు పెట్టి సినిమాలు నిర్మిస్తాము’ అంటూ వచ్చే వారందరినీ ‘వద్దు.. అని నచ్చజెప్పి పంపించేస్తాను’ అని త్రినాధ్ చెప్పారు. ‘అనకాపల్లి’ నిర్మాత నాయుడుకి కూడా అలానే నచ్చజెప్పారట.
కానీ అతని మొండిపట్టుదల చూసి… ఎంకరేజ్ చేసినట్టు త్రినాధ్ రావ్ నక్కిన చెప్పుకొచ్చారు. ఏమైనా త్రినాధ్ రావ్ నక్కిన నిజాయితీని అభినందించాల్సిందే. వాస్తవానికి ఇండస్ట్రీలో నిర్మాత అని పేరేసుకున్న వారంతా డబ్బులు పెట్టరు. కానీ వాళ్ళ బ్రాండ్ పైనే బిజినెస్ జరుగుతుంది కాబట్టి.. వాళ్ళ రాజ్యం నడుస్తుంది అంతే.














