15 ఏళ్ల తర్వాత ఇద్దరు నటులు కలసి పని చేస్తున్నారు అంటే ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో చెప్పండి. అదే ఆ నటులు హీరో – హీరోయిన్ అయితే ఫ్యాన్స్‌కు కూడా ఆ ఎమోషన్ వస్తుంది. ‘లియో’ సినిమాతో అలాంటి ఫీలింగ్‌ను కలిగించారు విజయ్ – త్రిష. ఎర్లీ డేస్‌లో వరుస సినిమాల్లో నటించిన ఈ ఇద్దరూ ‘లియో’తో మళ్లీ కలిశారు. ఈ సినిమా వచ్చి.. థియేటర్ల నుండి దాదాపు వెళ్లిపోయింది కూడా.
అయితే ఇటీవల త్రిష నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ నాటి ముచ్చట్లు వివరించింది. త్రిష, విజయ్ కలసి నటిస్తే ఎలా ఉంటుందో, వాళ్ల మధ్య కెమిస్ట్రీని చూసే చెప్పేయొచ్చు అంటారు. త్రిష కూడా అదే మాట చెప్పింది. మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ, విదేశాలలో చిత్రీకరించిన పాటలు చూస్తే ఆ విసయం తెలిసిపోతుంది. ‘లియో’లో తన పాత్రను చంపనని లోకేష్ ముందే చెప్పారు.
అదే మాట మీద నిలబడ్డాడు కూడా అని తన పాత్ర గురించి చెప్పింది (Trisha) త్రిష. 2020 చివరిలో లోకేశ్ తనకు ఈ కథ చెప్పారట. అక్కడికి రెండేళ్ల తర్వాతా తన ఆఫీస్‌లో రెండు గంటలకు పైగా కథను వివరించారట. అలాగే ఈ సినిమాలో ఆరు నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేశాం అని గుర్తు చేసుకుంది త్రిష. 20 ఏళ్లు వయసులో విజయ్‌ని మొదటిసారిగా కలిసిందట త్రిష. మళ్లీ ఇప్పుడు విజయ్ను కలవడం, సినిమా చేయడంతో సొంత ఇంటికి వచ్చినట్లు అనిపించింది అని చెప్పుకొచ్చింది.
ఈ జోడీ కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో సినిమా రిలీజ్ రోజు తెలిసింది. ఇద్దరూ కలసి ఉన్న సన్నివేశాలు వచ్చినప్పుడు థియేటర్లలో ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. అంతేకాదు ఇద్దరూ కలసి మరో సినిమా చేయాలి అని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ మాటలు విజయ్ వరకు వెళ్తాయో లేదో చూడాలి. వెళ్తే, సినిమా చేస్తే ఆనందమే కదా.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!