Trisha: త్రిష పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనేనా..?

అందం, అభినయంతో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో రెండు దశాబ్దాలుగా త్రిష వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. గత రెండేళ్ల నుంచి త్రిష హవా తగ్గినా తమిళంలో త్రిషకు చిన్న హీరోల సినిమాల్లో మాత్రం ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఇన్నేళ్లు పెళ్లికి దూరంగా ఉన్న త్రిష పెళ్లికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సమ్మర్ లో త్రిష వివాహం జరగనుందని సమాచారం. త్వరలోనే త్రిష అధికారికంగా పెళ్లికి సంబంధించి వెల్లడించనున్నారని సమాచారం.

అయితే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని త్రిష వివాహం చేసుకోవడం లేదని బాగా పరిచయం ఉన్న వ్యక్తిని ఆమె వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం త్రిష సరైన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని కాబోయే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నానని త్వరలోనే ఒంటరి జీవితానికి ముగింపు పలుకుతానని త్రిష అన్నారు. ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఒక్కొక్కరుగా వివాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

గతేడాది కాజల్ అగర్వాల్ వివాహం జరగగా ఈ ఏడాది నయనతార విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. గతంలో త్రిష కొంతమంది హీరోలతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మూడు నెలల క్రితం కోలీవుడ్ నటుడు శింబును త్రిష వివాహం చేసుకుంటారని ప్రచారం జరిగింది. త్రిష కెరీర్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ బిజినెస్ మేన్ వరుణ్ మనియన్ తో ఆమె వివాహం ఖరారైంది. వరుణ్ త్రిష నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరి పెళ్లి రద్దైంది. త్రిష తనకు తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారని జరుగుతున్న ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus