కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీకి పెద్ద దెబ్బె తగిలింది. ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాదు మీడియం రేంజ్ హీరోల సినిమాల షూటింగ్ లు కూడా ఇంకా మొదలు కాలేదు. ఈ క్రమంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయి అనే విషయం పై కూడా క్లారిటీ లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కొత్త బిజినెస్ మొదలు పెట్టారని సమాచారం. ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మరెవరో కాదు త్రివిక్రమ్ మరియు హరీష్ శంకర్లు. ఇంతకీ వాళ్ళు మొదలు పెట్టిన బిజినెస్ ఏంటి? వివరాల్లోకి వెళితే.. పవన్ సినిమా మొదలయ్యే వరకూ హరీష్ శంకర్ అలాగే.. ఎన్టీఆర్ సినిమా మొదలయ్యే వరకూ త్రివిక్రమ్ ఏడాది వరకూ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గ్యాప్ లో మీడియం రేంజ్ హీరోలతో సినిమా చెయ్యాలనుకున్నా.. వాళ్ళు కూడా ఖాళీగా లేరు. ఆల్రెడీ వరుస ప్రాజెక్టులకు కమిట్ అయ్యి అడ్వాన్స్ లు తీసేసుకున్నారు.
అందుకే త్రివిక్రమ్, హరీష్ లు మరోసారి రచయితలుగా మారాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు డైరెక్టర్స్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకుని స్టార్ స్టేటస్ సంపాధించారు కాబట్టి వాళ్ళ స్క్రిప్ట్ కు మంచి డిమాండ్ ఉంటుంది. వాటి రూపంలో కూడా కోట్లు సంపాదించుకోవచ్చు.అందుకే ప్రస్తుతం వారు అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.