OG Movie: ఓజీ రిలీజ్ వాయిదాకు త్రివిక్రమ్ కారణమా.. అసలేమైందంటే?

  • August 14, 2023 / 01:05 PM IST

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా బ్రో సినిమా మాత్రం యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ లో ఓజీ మూవీ రిలీజ్ కానుందని ప్రచారం జరగగా ఆ ప్రచారానికి భిన్నంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. అయితే ఓజీ రిలీజ్ వాయిదా వెనుక త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రో సినిమాకు కథనం, మాటలు త్రివిక్రమ్ అందించినా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో ఆడలేదు. ఓజీ సినిమా కోసం త్రివిక్రమ్ పని చేయకపోయినా ఈ సినిమాను సెట్ చేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది. ఓజీ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే త్రివిక్రమ్ పై మళ్లీ విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది.

అదే సమయంలో త్రివిక్రమ్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండటంతో ఇతర సినిమాలకు సంబంధించి జోక్యం చేసుకోలేరు. సుజిత్ త్రివిక్రమ్ సహాయంతో ఓజీ స్క్రిప్ట్ రాశారని తెలుస్తోంది. అందువల్ల ఓజీ ఔట్ పుట్ విషయంలో మార్పులు చేర్పుల కోసం త్రివిక్రమ్ ఈ సినిమాను వాయిదా వేయాలని సూచించారని ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న వార్తల గురించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. (OG Movie) ఓజీ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తైంది. పవన్ నెల రోజులు డేట్స్ కేటాయిస్తే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus