ఇది వర్కౌట్ అయితే మెగా ఫ్యాన్స్ కు పండగే..!

  • November 7, 2020 / 04:12 PM IST

ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో.. సోషల్ మీడియాలో అతని అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ.. హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మన మాటల మాంత్రికుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్… ఆ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా వల్ల ప్లానింగ్ లో మార్పు వచ్చింది.

దీంతో రామ్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయిపోయాడు. నిజానికి ఆ చిత్రానికి సంబంధించి ఈరోజే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలలో ఒకరైన పి.డి.వి ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ మరణించడంతో.. ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని తెలుస్తుంది. సరే ఇదిలా ఉండగా.. రామ్ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్.. ఎన్టీఆర్ లేదా మహేష్ బాబులతో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేసుకుంటున్నాడని టాక్ బలంగా వినిపిస్తోంది.

4 నెలల్లోనే పూర్తయ్యేలా ఆ ప్రాజెక్టు ఉంటుందట. ఇంకో విశేషం ఏమిటంటే ఈ కథలో మరో పెద్ద హీరోకి సరిపడా పాత్ర కూడా ఉందట. అందుకు గాను మెగాస్టార్ చిరంజీవిని.. త్రివిక్రమ్ సంప్రదించినట్టు సమాచారం. ఆయన కూడా పవన్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు టాక్. ఇది కనుక వర్కౌట్ అయితే.. మెగా ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus