ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోతున్న త్రివిక్రమ్..!

Advertisement

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అ..ఆ’. నితిన్- సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో చిత్ర బృందం చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేక పోతున్నాడట.

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తదుపరి చిత్రం తెరకెక్కనుండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ లో త్రివిక్రమ్ నిమగ్నమై ఉన్నాడని, పవన్ సూచన మేరకు వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాలనే యోచన మాటల మాంత్రికుడు ఉన్నాడని సమాచారం. కాగా ప్రస్తుతం పవన్ ఎస్‌జే సూర్య దర్శకత్వంలో నటిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news