త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ మాటల రచయిత మరియు దర్శకుడు స్వయంవరం ద్వారా మాటల రచయితగా తెరంగేట్రం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా, అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో సుప్రఖ్యాతుడయ్యారు. ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో బంగారు పతకం సాధించాడు. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. తెలుగు సినీ నటుల్లో ఆయనకు పవన్ కళ్యాణ్, సునీల్ ఆప్తమిత్రులు. ఇంకా దర్శకుడు విజయ భాస్కర్ కూడా మంచి స్నేహితుడే.