Manchu Lakshmi: యోగ డే సందర్భంగా లక్ష్మీని ఓ రేంజ్ లో ఆడుకున్న నెటిజన్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబంలో మంచు కుటుంబం ఒకటి. మోహన్ బాబు హీరోగా, విలన్ గా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మంచు వారసులుగా ఇండస్ట్రీలోకి విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీలో వీరు పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నారు. అయినా పలు సినిమాల ద్వారా మంచు విష్ణు లక్ష్మీప్రసన్న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇకపోతే తాజాగా మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్ వద్ద మోహన్ బాబుకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమా పై పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తూ పెద్దఎత్తున కామెంట్లు చేశారు. మోహన్ బాబు కుటుంబం గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ రావడంతో ఈ విషయంపై మోహన్ బాబు ఎంతో సీరియస్ అయ్యారు.

తమ కుటుంబం గురించి ఈ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్ లకు పాల్పడే వారికి పరువు నష్టం దావా వేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చిన పబ్లిక్ ఈ మాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా సమయం దొరికినప్పుడల్లా వీరి కుటుంబం పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మంచు విష్ణు లక్ష్మీప్రసన్న ఏదో ఒక ట్వీట్ వీడియో ద్వారా నెటిజన్ల చేతిలో దారుణమైన కామెంట్లకు గురవుతూ ఉంటారు.

తాజాగా మంచు లక్ష్మి అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో జూన్ 21వ తేదీ పలు యోగాసనాల ఈమె చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ‘అట్లుంటది మరి ఆంటీతోని’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘బామ్మగారు మనకు అవసరమా చెప్పండి’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే మంచులక్ష్మి లేచింది మహిళా లోకం అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

1

2

3

4

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus