‘బాలికా వధు’ సీరియల్ లో నటించి పాపులరైన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సీరియల్ తో పాటు.. బిగ్ బాస్ షోతో అభిమానుల్ని అలరించిన ఆమె తన ఇంట్లో సూసైడ్ చేసుకోవటం గ్రహించిన కుటుంబ సభ్యులు కొన ఊపిరితో వున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రత్యూష తన ప్రాణాలను కోల్పోయింది. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలు కారణంగా ఆమె ఆత్మహత్య చెసుకుందని భావిస్తున్నారు. రాహుల్ రాజ్ సింగ్ అనే నటుడితో గత కొంత కాలంగా ప్రేమలో వుందట ప్రత్యూష. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే తను ఈ పని చేసిందని భావిస్తున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది!