Balayya Babu: బాలయ్య – గోపీచంద్‌ హీరోయిన్‌ ఫైనలా!

  • June 1, 2021 / 03:05 PM IST

‘అఖండ’ తర్వాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఏంటి అనేది ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని మాత్రం వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి ఏళ్ల చరిత్ర ఉన్న వేటపాలెం లైబ్రరీలో కూర్చుని కీలక అంశాలు నోట్‌ చేసుకున్నాడు గోపీచంద్‌ మలినేని. దీంతో ఈ సినిమాకు ఆ ప్రాంతానికి చెందిన కథ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇదంతా ఓ చర్చ అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనేది ఇంకో చర్చ.

సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాలు అంటే… కథానాయిక దగ్గర చాలా సేపు బండి ఆగిపోతోంది. కుర్ర హీరోయిన్లు నప్పక, సూట్‌ అయ్యే వాళ్లు ఒప్పుకోక హీరోయిన్‌ టాపిక్‌ మీద చర్చ జరుగుతూనే ఉంటోంది. అయితే ఈ సినిమా విషయంలో అలా ఉండకూడదు అనుకున్నారేమో.. ఇప్పుడు హీరోయిన్‌ టాపిక్‌ చర్చలోకి తీసుకొచ్చేశారు. ఈ క్రమంలో తొలుత శ్రుతి హాసన్‌ పేరు వినిపించింది. గోపీచంద్‌ మలినేని, శ్రుతి హాసన్‌ది హిట్‌ కాంబో కావడం గమనార్హం.

దీంతో ఈ సినిమా బాలయ్య పక్కన శ్రుతి నటిచడం పక్కా అనుకున్నారంతా. అయితే ఇప్పుడు త్రిష ఎంటర్‌ అయ్యింది. ఈ సినిమా నాయిక పాత్ర కోసం త్రిషను సంప్రదించారని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే చిత్రబృందం త్రిషను సంప్రదించిందట. అయితే శ్రుతి ప్లేస్‌లో త్రిషనా… లేక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా? అనేదే ఇక్కడ ప్రశ్న. మామూలుగా అయితే బాలయ్య సినిమాల్లో ఇద్దరు కథానాయికలు కామన్‌. ఇందులోనూ అంతేనేమో.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus