Vijay Deverakonda: విజయ్ లిస్ట్ లో రెండు బాలీవుడ్ సినిమాలు!

Advertisement

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి సినిమాలు అతడికి స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ఈ మధ్యకాలంలో విజయ్ కి సరైన హిట్టు ఒక్కటి కూడా పడలేదు. అయినప్పటికీ అవకాశాలకు మాత్రం లోటు లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అయింది. నిజానికి ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డారు. శారీరకంగా ఎంతో శ్రమించారు.

కానీ కథ,కథనాల్లో సత్తా లేకపోవడంతో సినిమా ప్లాప్ అయింది. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు విజయ్. కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. విజయ్ కి మంచి సినిమా ఇవ్వలేకపోయానని భావిస్తోన్న కరణ్.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో పడ్డారు. ఓ కొత్త దర్శకుడు దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గా విజయ్ కి, ఈ డైరెక్టర్ కి మధ్య మీటింగ్ కూడా జరిగింది. ఈసారి యూత్ ఫుల్ కంటెంట్ తో సినిమా చేయాలనేది కరణ్ జోహార్ ప్లాన్.

ఈ సినిమాతో పాటు విజయ్ కి బాలీవుడ్ లో మరో ఆఫర్ కూడా వచ్చిందట. స్టార్ హీరో షారుఖ్ ఖాన్.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ మీద వరుస సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యానర్ లో విజయ్ దేవరకొండతో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైత్ విజయ్ దేవరకొండ తెలుగులో ‘ఖుషి’ అనే సినిమాపై దృష్టి పెట్టారు.

శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు విజయ్. మరేం జరుగుతుందో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read