బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ అంటే అందరికీ హడల్. హౌస్ మేట్స్ కి హోస్ట్ నాగార్జున క్లాస్ పీకుతుంటే ఎలా కవర్ చేస్కోవాలా అని హౌస్ మేట్స్ ఆలోచిస్తుంటారు. అయితే, ఈవారం మాత్రం యావర్ కి ఫుల్ గా క్లాస్ పడింది. అలాగే ఎప్రిషియేషన్స్ కూడా వచ్చాయనేది టాక్. ఇక యావర్ దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి రెండు పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఫ్రీ పాస్ తో యావర్ ఎవరినైనా సరే సేఫ్ చేసే అధికారం ఉంది. అలాగే, ఎవరినైనా ఎలిమినేట్ కూడా చేయచ్చు. నిజానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే ఎప్పుడూ కూడా తమకి తాము ఉపయోగించుకుంటారు. లేదంటే ఎవరికైనా ఉపయోగించి వారిని సేఫ్ చేస్తారు. గత సీజన్స్ లో ఇలాగే జరిగింది. కానీ, ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ కి రెండు పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్.
యావర్ ఎవరినైనా సరే నామినేషన్స్ లో వారిని ఎలిమినేట్ చేయచ్చు. అలాగే, సేఫ్ కూడా చేయచ్చు. లాస్ట్ లో ఇద్దరు ఉన్నప్పుడు డిసైడర్ ఫ్యాక్టర్ యావర్ అవుతాడన్నమాట. ఇక్కడే బిగ్ బాస్ యావర్ కి మంచి పవర్ ఇచ్చాడు. నిజానికి అది ఈవారం అతను ఉపయోగించుకుంటాడా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
సీజన్ 2లో కుడా చూసినట్లయితే, కౌషల్ కి ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. దాని ప్రకారం ఒకరిని సేఫ్ చేయాలి. ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్పారు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక శనివారం హోస్ట్ నాగార్జున చేతిలో అందరికీ ఫుల్ కోటింగ్ పడినట్లుగా సమాచారం. ఈవారం డేంజర్ జోన్ లో నలుగురు ఉన్నారు.
మొత్తం 8మంది నామినేషన్స్ లో ఉంటే నలుగురు సేఫ్ గా ఉన్నారు. అర్జున్, యావర్, అమర్, ప్రియాంక సేఫ్ గా ఉన్నారు. ప్రియాంక కెప్టెన్ అయ్యింది కాబట్టి ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. అలాగే నెక్ట్స్ వీక్ కూడా సేఫ్ అవుతుంది. అంతేకాదు, స్టార్ మా బ్యాచ్ లో అమర్, శోభాశెట్టి కూడా సేఫ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలా అయితే ముగ్గురు డేంజర్ జోన్ లోకి వస్తారు. గౌతమ్, రతిక, ఇంకా అశ్విని ముగ్గురూ డేంజర్ జోన్ లో వస్తారు. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.