‘పవన్’కు ఊహించని షాక్!!!

  • July 25, 2016 / 08:58 AM IST

దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అంటారు అందరూ. అయితే మన తమిళ దర్శకుడు సూర్య కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే…పవన్ కల్యాణ్ సినిమా హీరోగా నిలదొక్కుకుంటున్న క్రమంలో ఆయన చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన కరియర్ లోనే టాప్ హిట్ గా నిలిచింది అప్పటి “ఖుషీ”. అయితే ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు సూర్య. అయితే అనేక భారీ అంచనాల నడుమ సూర్యతో కలసి “కొమరమ్ పులి”చేశాడు.

అయితే ఫర్స్ట్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింది, రెండో సినిమా అంతటి డిజాష్టర్ గా మారింది. ఇక ఈ కధ అంతా పక్కన పెడితే….తాజాగా పవన్ సినిమాకు దర్శకుడిగా ఎంపికైన దర్శకుడు సూర్య అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అని తెలిసిందే. అయితే మహేష్ సినిమాలో విలన్ పాత్ర కోసమే తాను తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ….అసలు విషయం వేరే ఉంది అని తెలుస్తుంది…ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే…ఈమధ్య కాలంలో ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ లుగా మారడంతో, పవన్ సినిమా దర్శకత్వానికి శరత్ మరార్ కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పడం,

అదే క్రమంలో అనుకోకుండా ఎస్.జె. సూర్యా నటించిన ‘ఇరైవి’ తమిళంలో సూపర్ హిట్ కావడం మురగదాస్ దృష్టి సూర్యా పై పడటంతో పాటు మహేష్ సినిమాలో విలన్ పాత్ర పోషించడానికి 2 కోట్ల భారీ ఆఫరింగ్ రావడంతో దర్శకుడుగా కోటి కన్నా, విలన్ గా రెండు కోట్లు, అదీ రెండు నెలల్లో అంత పారితోషకం వస్తూ ఉండడంతో, సూర్య అలా పవన్ కు షాక్ ఇచ్చాడని సమాచారం. ఏది ఏమైనా…సూర్య ప్రిన్స్ సినిమాకు ఫిక్స్ అంతే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus