Mahesh Babu: తెర వెనుక మహేష్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

  • August 9, 2022 / 03:53 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు…నటశేఖర కృష్ణ చిన్నబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి మహేష్ బాబుని హీరోని చేయాలనే ఉద్దేశం మొదట కృష్ణ గారికి లేదు. తన పెద్దబ్బాయి రమేష్ బాబునే హీరోని చేద్దాం అనుకున్నారు.మహేష్ బాబు వ్యాపార రంగంలో రాణిస్తాడని ఆయనకు ఓ జ్యోతిష్యుడు చెప్పాడట. కృష్ణ జీవితంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిన చాలా విషయాలు నెరవేరాయి. అందుకే తన ‘పద్మాలయ స్టూడియోస్’ బ్యానర్లో నిర్మించబోయే సినిమాల పనుల్ని మహేష్ చేతిలో పెట్టాలని ఆయన మొదట భావించారు. కానీ మహేష్ విషయంలో కృష్ణ గారి ఆలోచనలు తలక్రిందులు అయ్యాయి. ఆయన పెద్దబ్బాయి రమేష్ బాబు పెద్దగా క్లిక్ అవ్వలేదు.

దీంతో మహేష్ ను హీరోగా లాంచ్ చేయాల్సి వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా 9 సినిమాల్లో నటించిన మహేష్, కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. నిజానికి కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల రాఘవేంద్ర రావు గారి చేతిలో పడ్డాడు మహేష్. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సూపర్ స్టార్ గా నిలబడ్డాడు.

‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి’ అనే ప్రిన్సిపుల్ ను మహేష్ తూచా తప్పకుండా ఫాలో అవుతాడు. సినిమాల్లో ఎంత స్టైలిష్ గా కనిపించినా రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా కనిపిస్తాడు. అంతేకాదు నిజ జీవితంలో కూడా మహేష్ హీరో అనే చెప్పాలి.

1) ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మహేష్ 2 గ్రామాలను దత్తత తీసుకుని.. సేవలు అందిస్తున్నాడు. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో మహేష్ చాలా సాయమందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కీలక బాధ్యతల్ని ఆయన సతీమణి నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.

2) కరోనా టైంలో ఆ రెండు గ్రామాల ప్రజలకు ఫ్రీగా వ్యాక్సిన్ వేయించి గొప్ప మనసు చాటుకున్నాడు మహేష్.

3) మహేష్ చాలా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతం.. చారిటీ కోసం ఖర్చు చేస్తున్నారు మహేష్.

4) రెయిన్‌ బో ఆస్పత్రి వారితో కలిసి ఇప్పటివరకు 1000 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి మానవత్వం చాటుకుంటున్నారు. ఇంతమందికి ప్రాణదానం చేయడం అంటే మామూలు విషయం కాదు.

5) ఎటువంటి విపత్తు వచ్చినా.. మహేష్ ముందుంటాడు. హుదుద్‌ తుఫాను సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 2.5 కోట్లు విరాళాన్ని అందించాడు మహేష్. కరోనా టైంలో కూడా సినీ కార్మికుల రూ. 25 లక్షలు సాయం అందించాడు.

6) మహేష్ తన తండ్రి ప్రతి పుట్టినరోజు నాడు ఎంతో మంది ఆర్ఫన్స్ కు అన్నదానం చేస్తుంటారు.

7) నిర్మాతల పాలిట రాబిన్ హుడ్ లాంటి వ్యక్తి. పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు మహేష్. అది నిజమే.. కానీ నిర్మాతకి ఏమాత్రం లాస్ వచ్చినా.. తనకు అందిన పారితోషికంలో 60 శాతం వెనక్కి ఇచ్చేస్తుంటారు మహేష్.

8) యూనిట్ మెంబర్స్, టెక్నిషియన్స్ తో మహేష్ చాలా సన్నిహితంగా ఉంటారు. వారిలో చాలా మంది పిల్లల చదువుల కోసం మహేష్ సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి.

9) ఇండస్ట్రీలో కూడా చాలా మంది నటీనటులకు మహేష్ ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించిన కుమనన్ సేతురామన్ అనారోగ్యంతో బాధపడుతుంటే మహేష్ ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించాడు మహేష్.

10) తన సినిమాలకు మాత్రమే కాదు.. తనకు నచ్చితే తోటి హీరోల సినిమాలకు అలాగే పోటీగా ఉన్న హీరోల సినిమాలకు కూడా ట్వీట్లు వేసి అభినందిస్తూ తన హుందాతనాన్ని చాటుకుంటూ ఉంటాడు మహేష్.

ఇప్పటివరకు టైమ్స్ వారు నిర్వహించే ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ విభాగంలో ‘ఫరెవర్ డిజైరబుల్ మెన్’ గా నిలిచి బాలీవుడ్ స్టార్లను సైతం పక్కకు నెట్టాడు మహేష్.

సూపర్ స్టార్ అనే ట్యాగ్ కు కూడా మహేష్ దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంటారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus