మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న అందరికీ సుపరిచితమే.మొదట్లో పలు టాక్ షోలకు హోస్ట్ గా చేసింది. అవి సక్సెస్ అయ్యాయి. కెమెరా అంటే భయం పోగొట్టుకోవడానికి, కెమెరాని ఫేస్ చేసే ధైర్యం కోసమని ఆ టాక్ షోలు చేస్తూ వచ్చింది. అటు తర్వాత అడపా దడపా సినిమాల్లో కూడా నటించింది. ‘అనగనగా ఓ ధీరుడు’ ‘దొంగాట’ ‘మాన్స్టర్’ వంటి సినిమాలు నటిగా మంచు లక్ష్మీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉండగా.. మంచు లక్ష్మీని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నప్పటికీ..
వ్యక్తిగా ఆమె చాలా మంచిదని ఇండస్ట్రీ అంతా చెబుతుంటుంది. ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లిని అన్నీ తానై జరిపించింది మంచు లక్ష్మీ. కుటుంబం అతన్ని పక్కన పెట్టాలని చూసినా అక్కగా తాను చేరదీసి ఈ పెళ్లి ఘనంగా జరిగేలా చేసింది. అయితే మంచు లక్ష్మీ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈమె వ్యక్తిగత జీవితం గురించి తెలీకుండానే ఈమెను ట్రోల్ చేసే బ్యాచ్ ఉన్నారు.
ఆ విషయాన్ని పక్కన పెడితే.. మంచు లక్ష్మీ తన భర్తతో విడిపోయింది అంటూ చాలా మంది అనుకుంటారు.ఇప్పటికీ ఆమె లక్ష్మీ మంచుగానే పిలువబడుతుండడంతో ఈమె విడాకులు తీసుకోవడంతో అలా పిలుస్తున్నారని అంతా అనుకుంటారు. పెళ్లి అయినా లక్ష్మీ తన ఇంటి పేరును మార్చుకోకపోవడం,తన కూతురితో కలిసి హైదరాబాద్ లోనే ఉంటూ కెరీర్ కొనసాగిస్తుండడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. లక్ష్మీ ప్రసన్న భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఇతను అమెరికాలో ఉంటున్నారు.కానీ లక్ష్మీతో విడిపోలేదు.
ఇటీవల జరిగిన మంచు మనోజ్ రెండో పెళ్లి లో ఆండీ శ్రీనివాసన్ కూడా దర్శనమిచ్చాడు. లక్ష్మీ పక్కనే ఆండీ ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 2006లో లక్ష్మీ – ఆండీ ల పెళ్లి జరిగింది. ఆండీ అసలు పేరు ఆనంద్. ఆయన ఓ ఐటీ వ్యాపారవేత్త. ఈ జంటకు విద్యా నిర్వాణ అనే పాప కూడా ఉంది. సరోగసి ద్వారా వీరు ఆ పాపకు జన్మనిచ్చారు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!