Baladitya: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ బాలాదిత్య గురించి 10 ఆసక్తికర విషయాలు.!

  • September 28, 2022 / 07:51 PM IST

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై 3 వారాలు దాటింది.21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్తే.. 3 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. హౌస్ లో ఇప్పుడు 18 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.అయితే జనాలకు బాగా తెలిసిన కంటెస్టెంట్లలో బాలాదిత్య ఒకడు. హౌస్ లోకి 12వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలాదిత్య.. చాలా కూల్ గా గేమ్ ఆడుతున్నాడు. ఎవరు ఎంత ఇరిటేట్ చేసినా డీవియేట్ అవ్వడం లేదు మనోడు. కచ్చితంగా ‘బిగ్ బాస్ 6’ లో ఇతను టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా అంటున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టి ఇతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) బాలాదిత్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో 1982 వ సంవత్సరంలో మార్చి 9న జన్మించాడు.

2) చెన్నైలోని రామకృష్ణ మిషన్ స్కూల్ లో ఇతను స్కూలింగ్ కంప్లీట్ చేశాడు.అలాగే నలంద జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు.

3) ఆదిత్య ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేశాడు.అటు తర్వాత ‘రౌడీగారి పెళ్ళాం’ ‘జంబలకిడి పంబ’ ‘ఆజ్ క గుండా రాజ్’ ‘హలో బ్రదర్’ ‘హిట్లర్’ ‘సమరసింహారెడ్డి’ వంటి చిత్రాలతో కలుపుకుని 24 చిత్రాల్లో ఇతను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.

4) 2003 లో ఇతను హీరోగా ‘చంటిగాడు’ అనే మూవీ చేశాడు. బి.జయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా బి.ఎ.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ 22 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. డెబ్యూ మూవీతో ఆ ఫీట్ ను సాధించిన అతి తక్కువ మంది హీరోల్లో ఇతను కూడా ఒకడు.

5) ‘చంటిగాడు’ తర్వాత ‘కీలు గుర్రం’ ‘వంశం’ ‘రూమ్ మేట్స్’ ‘సంధ్య’ ‘1940 లో ఒక గ్రామం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు.

6) ‘1940 లో ఒక గ్రామం’ చిత్రాన్ని నరసింహ నంది డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం కేటగిరిలో నేషనల్ అవార్డు గెలుచుకుంది.

7) ఈ మధ్యనే మా ఊరి పొలిమేర అనే చిత్రంలో కూడా ఇతను హీరోగా నటించాడు.

8) హీరోగా పెద్దగా రాణించకపోవడంతో ఇతను సీరియల్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయాడు. సావిత్రమ్మ గారి కొడుకు, శాంభవి వంటి సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు

9) ఆదిత్యకి 2016లో మానస లక్ష్మీ అనే అమ్మాయితో పెళ్లి అయ్యింది. మరో సీరియల్ ఆర్టిస్ట్ కౌశిక్ ఇతనికి అన్నయ్య అవుతాడు. ఆదిత్య తండ్రి వై.ఎస్.శంకర్ కూడా నటుడే. అరుంధతి వంటి చిత్రాల్లో నటించాడు.

10) ఆదిత్య సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. అంతేకాదు కాంట్రవర్సీలకు కూడా దూరంగా ఉంటాడు. కాబట్టి మొదట బిగ్ బాస్ హౌస్ లో ఇతను ఎలా ఉంటాడా అని అంతా అనుకున్నారు. కానీ ఆదిత్య కూల్ గానే గేమ్ ఆడుతున్నాడు. మొదటి వారం ఇంటి కెప్టెన్ అయ్యాడు కూడా..!

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus