Chalaki Chanti: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ చలాకీ చంటి గురించి 10 ఆసక్తికర విషయాలు..!

  • September 30, 2022 / 12:22 PM IST

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై 4 వారాలు పూర్తి కావస్తోంది. ఆల్రెడీ 3 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో చాలా మంది తెలీని కంటెస్టెంట్లు వచ్చారు. జనాలకు తెలిసిన కంటెస్టెంట్లు చాలా తక్కువ. ఆ తెలిసిన కంటెస్టెంట్లో చలాకి చంటి ఒకడు.హౌస్ లో ఇతను కూల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నా.. ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఓ బింబిసార లా ఎంట్రీ ఇచ్చాడు చంటి. ఇతని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) చలాకీ చంటి అసలు పేరు వినయ్ మోహన్. ఇతను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. 1986 జూన్ 29న ఇతను జన్మించాడు.

2) ఇతను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు కానీ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా డిగ్రీ పూర్తి చేయలేకపోయాడు.

3) ఇతను టాటా ఇండికాం కస్టమర్ కేర్ లో కొన్నాళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. అటు తర్వాత ఓ గెస్ట్ హౌస్ కు మేనేజర్ గా కూడా పనిచేశాడు.

4) అదే సమయంలో రేడియో జాకీ ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాడు. అటు తర్వాత ఇతను ‘చంటి బ్యాంక్’ అనే ప్రోగ్రాంని హోస్ట్ చేశాడు. ఇతనికి చంటి అనే పేరు అక్కడి నుండే వచ్చింది.

5) ఇతనికి మిమిక్రీ చేసే టాలెంట్ కూడా ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వర రావు గారిని, నాగార్జునని బాగా ఇమిటేట్ చేయగలడు.

6) అటు తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు ఆడిషన్స్ ఇచ్చేవాడు. 2009 లో వచ్చిన ‘జల్లు’ అనే మూవీలో ఇతనికి అవకాశం దక్కింది.

7) అటు తర్వాత ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఇతనికి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

8) చంటి ఇప్పటివరకు 80 నుండి 90 సినిమాల్లో నటించాడు.కానీ ఇతన్ని పాపులర్ చేసింది మాత్రం ‘జబర్దస్త్’ అనే చెప్పాలి. దాని తర్వాత ఈటీవీ ప్లస్ కోసం చేసిన ‘నా షో నా ఇష్టం’ అనే షో కూడా సక్సెస్ అయ్యింది.

9) చలాకీ చంటికి 2016 లో పెళ్లయింది. ఇతని భార్య పేరు శ్వేత. 2018 లో ఈ దంపతులకు ధన్యత అనే పాప కూడా పుట్టింది.

10) చంటి తన జీవితంలో చాలా పోగొట్టుకున్నప్పుడు ఇతని భార్య శ్వేత ఇతనకి అండగా నిలిచింది.

11) చంటిది లవ్ మ్యారేజ్. తన తల్లిదండ్రులతో గొడవ పడి మరీ శ్వేతాని పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. చంటికి ‘జబర్దస్త్’ ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి..!

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus