Tanya Deol: బాబీ డియోల్ భార్య గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయాలు.!

యానిమల్ సినిమాని ఇప్పట్లో అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోలేరు. అర్జున్ రెడ్డి తర్వాత అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ఇది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.900 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. రశ్మిక మందన , రణబీర్ కపూర్ ల కెమిస్ట్రీ ఈ సినిమాలో ఎంత హైలెట్ అయ్యిందో, తృప్తి దిమిరి అనే అమ్మాయితో హీరో రణబీర్ కపూర్ బెడ్ రూమ్ సీన్స్ కూడా అంతే హైలెట్ అయ్యాయి అని చెప్పాలి.

మరోపక్క ఈ సినిమాలో విలన్ గా చేసిన బాబీ డియోల్ ను కూడా అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోరు. ఆయన ఈ సినిమాలో అంత క్రూయల్ గా కనిపించాడు. ఆయన విలనిజం బాగా పండింది. తెలుగు ప్రేక్షకులకు బాబీ డియోల్ గురించి ఎక్కువగా తెలియదు అనే చెప్పాలి.బాలీవుడ్ సీనియర్ నటుడు అయిన ధర్మేంద్ర కుమారుడే బాబీ డియోల్. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్… చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

యానిమల్ సినిమా కోసం ఇతను ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం అందుకున్నాడు అని సమాచారం. ఇక 1996లో బాబీ డియోల్ తాన్య (Tanya Deol) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఒకప్పటి టాప్ క్లాస్ బిజినెస్ మెన్ దేవేంద్ర అహుజా ముద్దుల కూతురు. దేవేంద్ర అహుజా తన కుమార్తెకు రూ. 300 కోట్ల ఆస్తి ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పటికి బాబీ డియోల్ ఆస్తి రూ.66 కోట్లు మాత్రమేనట

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus