రాజమౌళి తరువాత అంత స్టార్ ఇమేజ్ కలిగిన దర్శకుడు ఎవరన్నా ఉన్నారా? అంటే.. అది కొరటాల శివ అనే చెప్పాలి. ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ అనే నాలుగు చిత్రాలు తెరకెక్కించి నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకుని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు దర్శకుడు కొరటాల. ప్రస్తుతం చిరుతో ‘ఆచార్య’ కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తన చిత్రాలతో కేవలం హిట్లు కొట్టడం మాత్రమే కాదు.. ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేసి ప్రేక్షకులకు మంచి మెసేజ్ కూడా ఇస్తుంటాడు కొరటాల.
అయితే అతని మంచి వ్యక్తిత్వానికి.. అలాగే సక్సెస్ లకు వెనుక ఉన్నది అతని భార్యే అని చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. నిజానికి కొరటాల శివ భార్య పేరు ఏంటి? ఆమె ఎవరు అనే విషయాలు చాలా మందికి తెలీదు. కొరటాల శివ భార్య పేరు అరవింద. ఈమె లండన్ లో చదువుకుంది. కొరటాల-అరవింద లది ప్రేమ వివాహమట. కొరటాల సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్నప్పటికీ.. వీళ్ళు ఒక చిన్న అపార్ట్ మెంట్ లోనే నివసిస్తున్నారట.
అరవింద… రామకృష్ణ పరమహంస భక్తురాలట. ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఈమె ఉన్నత విలువలు కలిగిన మంచి మనిషిగా ఉందని మనం అర్ధం చేసుకోవచ్చు. వీళ్ళు సంపాదించే సంపాదన ఎక్కువగా సమాజ సేవలకే ఖర్చుపెడుతుంటారట. నిజానికి మహేష్ బాబు.. ‘ శ్రీమంతుడు’ సినిమాలో శృతి హాసన్ పాత్రను అరవింద ఇన్స్పిరేషన్ తోనే రాసుకున్నాడట కొరటాల. ఈమె కూడా అనాధ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే పిల్లలను కన కూడదని డిసైడ్ అయ్యిందట. ఈమె ఎంత గొప్ప వ్యక్తో ఈ విషయాలను బట్టే చెప్పొచ్చు.