పేదల పాలిట వరం పుత్తూరు ఎముక వైద్యం. ఆయుర్వేద వైద్యంలోని అద్భుతాల్లో ఇది ఒకటి అని చికిత్స పొందిన వారు చెబుతుంటారు. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే దారిలో కనిపించే పుత్తూరు అనే గ్రామంలో ఈ వైద్యాన్ని అందిస్తుంటారు. విరిగిన ఎముకులను అతికించడానికి అనేక అధునాతన పద్ధతులను నేటి వైద్యులు కనిపెట్టినప్పటికీ ప్రత్యేకమైన మొక్క ఆకుల పసరుతో చేసే ఈ పుత్తూరు ఎముక వైద్యం ఇప్పటికీ తిరుగులేని వైద్యంగా పేరుగాంచింది.
ఈ వైద్యం వెనుక ఉన్న విశేషాలను రహస్యవాణి సేకరించి “వైద్య విజ్ఞానానికి అందని రహస్యం, పుత్తూరు ఎముక వైద్యం” అనే వీడియోని రూపొందించింది. మీరు ఈ వైద్యం గొప్పదనం తెలుసుకోవాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి.