సమంత బర్త్ డే.. ప్రత్యేక కథనం: లక్కీ లేడీ సమంత సౌత్ ఇండియా టాప్ స్టార్స్ లో ఒకరు. అత్యధిక పారితోషికం అందుకునే టాప్ యాక్ట్రెస్. టాలీవుడ్ బడా ఫ్యామిలీలలో ఒకటైన అక్కినేని వారి కోడలు, నాగచైతన్య భార్య. ఇలా చెప్పుకుంటో పోతే సమంత ప్రొఫైల్ పూర్తి చేయడానికి చాల సమయమే పడుతుంది. ఒకప్పుడు చెన్నైలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సాధారణ అమ్మాయిగా ఉన్న సమంత రూత్ ప్రభు నేడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. 1987 ఏప్రిల్ 28న పుట్టిన సమంత నేడు 33వ పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణంలో ఆసక్తికరమైన ‘మజిలీ’లు ఆసక్తికర విషయాలు మీకోసం..
ఆ అవసరం హీరోయిన్ ని చేసింది
సమంత కేవలం 14ఏళ్ల వయసులో పాకెట్ మనీ కోసం మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకుంది. సినిమాటోగ్రాఫర్ రవి వర్మ డైరెక్టర్ గా తన డెబ్యూ మూవీ మోస్కోవిన్ కావేరీ సినిమాకు హీరోయిన్ గా సమంతను ఎంచుకున్నారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఓ క్యూట్ యంగ్ లేడీ కోసం వెతుకుతున్న డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ కి సమంత బాగా నచ్చేసిందట. దీనితో నాగ చైతన్య హీరోగా వచ్చిన ఏమాయ చేశావే సినిమా కోసం సమంతను తీసుకున్నారు. మోస్కోవిన్ కావేరి చిత్రం కంటే ముందే ఏమాయ చేశావే మూవీ విడుదలై సూపర్ హిట్ అందుకుంది.
లక్కి హీరోయిన్ ఇమేజ్
సమంతను పరిశ్రమలో లక్కీ హీరోయిన్ అంటారు. ఆమెది గోల్డెన్ లెగ్.. సమంత నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. టాలెంట్ అండ్ లక్ రెండు కలిగిన రేర్ బ్యూటీ సమంత
స్కూల్ టాపర్.. మ్యాథ్స్ జీనియస్
సమంత కు ఆకర్షించే అందమేకాదు, ఆకట్టుకొనే తెలివితేటకు కూడా ఉన్నాయి. చదువుకునే రోజుల్లో ఆమె స్కూల్ టాపర్ అట. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ లో ఆమె సూపర్ జీనియస్. ఆన్లైన్ చాట్ లో ఓ నెటిజెన్ పంపిన ఈక్వేషన్ క్షణాల్లో సాల్వ్ చేసి అతడికి షాక్ ఇచ్చిందట.
అరుదైన రికార్డు సమంత సొంతం
సమంత ఇప్పటి వరకు దాదాపు 12 అవార్డు గెలుపొందింది. వీటిలో 3 ఫిలిం ఫేర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. 2013 తెలుగు తమిళ్ రెండు భాషలకు ఫిల్మ్ ఫేర్ అందుకున్న నటిగా సమంత రికార్డు సృష్టించింది. సీనియర్ హీరోయిన్ రేవతి తరువాత ఆ ఫీట్ సాధించిన ఏకైక హీరోయిన్ సమంత.
సమంత ముద్దు పేరు
సమంతని ఇంట్లో ముద్దుగా యశోదా అని పిలుస్తారట. యషు అని పిలుపించుకోవాడిన్నీ సమంత చాలా ఇష్టపడుతుందట. తెలుగు తండ్రి మలయాళ తల్లికి పుట్టిన సమంత తమిళియన్ ఐడెంటిటీని ఇష్టపడుతుందట.
సేవా గుణం కూడా తక్కువేం కాదు
సమంత తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు ఉపయోగిస్తుంది. ప్రత్యూష సపోర్ట్ పేరుతో సమంత ఓ ఎన్ జి ఓ నడుపుతున్నారు. దీని ద్వారా మహిళలు మరియు ఆడపిల్లకు సేవ చేస్తున్నారు.
మాటా మంతి
సౌత్ లోని అన్ని భాషలపై పట్టున్న సమంత అనర్గళంగా మాట్లాడ గలదు. ఐతే ఆమె ఇంటిలో ఉన్నప్పుడు మాతృ భాష మలయాళం లేదా ఇంగ్లీష్ లో ఎక్కువగా మాట్లాడతారట. తెలుగు కూడా చక్కగా మాట్లాడుతుంది సమంత. సినిమాలలో ఆమెకు సింగర్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెవుతారు.
సమంతకు ఇష్టమైన వంటకం
సమంత భోజన ప్రియురాలే నట. ఆమె ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడతారు. జపనీస్ నాన్ వెజ్ డిష్ సుషీ ఆమె ఫెవరెట్ అట. ఇక ఇంట్లో అప్పుడప్పడూ నాగ చైతన్య చేసే వంటలను ఆమె ఇష్టంగా తింటారట.
అందం వెనుక చిన్న అనారోగ్యం
సమంతకు డయాబెటిస్ ప్రాబ్లెమ్ ఉంది. ఇలాంటి అనారోగ్య కారణాలతో మణిరత్నం కడలి మూవీ, శంకర్ ఐ సినిమాలలో హీరోయిన్ ఆఫర్స్ పోగొట్టుకున్నారు. వ్యాయామంతో సమంత వాటిని జయించారు.
పుస్తకాల పురుగు
సమంతకు పుస్తకాలు చదవడం ఇష్టమైన అలవాటు. ఇప్పటికే అనేక పుస్తకాలు చదివిన సమంతకు రొండా బైర్నే రాసిన సీక్రెట్ అనే పుస్తకం అంటే బాగా ఇష్టం అట.